Begin typing your search above and press return to search.

ఫ్యామిలీతో మ‌రో స్టార్ హీరో ఇంట్లో కాపురం!

బాలీవుడ్ జోడీ వ‌రుణ్ ధావ‌న్- న‌టాషా ఇటీవ‌లే త‌ల్లిదండ్రులైన సంగ‌తి తెలిసిందే. జూన్ 3న న‌టాషా పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నించ్చింది

By:  Tupaki Desk   |   11 Jun 2024 6:40 AM GMT
ఫ్యామిలీతో మ‌రో స్టార్ హీరో ఇంట్లో కాపురం!
X

బాలీవుడ్ జోడీ వ‌రుణ్ ధావ‌న్- న‌టాషా ఇటీవ‌లే త‌ల్లిదండ్రులైన సంగ‌తి తెలిసిందే. జూన్ 3న న‌టాషా పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నించ్చింది. దీంతో ధావ‌న్ కుటుంబ స‌భ్యుల ఆనందానికి అవ‌దుల్లేవ్. ఆ సంతోషాన్ని ఎంతో గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకున్నారు. మా జీవితాల్లోకి కొత్త సంతోషం తోడైందంటూ ధావ‌న్ ఫ్యామిలీ అంతా సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంది. ఇప్పుడిదే రెట్టించిన సంతోషంలో ధావ‌న్ దంప‌తులు కొత్త ఇంట్లోకి వెళ్ల‌బోతున్నారు.

ముంబైలోని ఓ విలాస‌వంత‌మైన ప్లాట్ కి షిప్ట్ అవుతున్నారు. దీని ధ‌ర 50 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని స‌మాచారం. పాపాయి కి అన్ని ర‌కాల సౌక‌ర్యాలు ఉండాల‌ని..ఇప్పుడు ఉంటోన్న ఇంటిలో అవేవి లేక‌పో వ‌డంతో ఇలా ఇల్లు మారుతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి బిడ్డ పుట్టిన సంద‌ర్భంగా 50 కోట్లు ఖ‌రీదైన ఇల్లు కొన్నారా? అంటే కొనలేదు. ఇది స్టార్ హీరో హృతిక్ రోష‌న్ సొంతిల్లు.

ఆయ‌న ఇటీవ‌లే 100 కోట్ల విలువైన భ‌వంతిలో కి వెళ్లిపోయాడు. అప్ప‌టి నుంచి ఆ ఇల్లు ఖాళీగా ఉంటుంది. దీంతో హృతిక్ పాత ఇంటికి వ‌రుణ్ ధావ‌న్ చేరుతున్న‌ల్తు తెలుస్తోంది. ఇది స‌రిగ్గా జుహూ బీచ్కి ఎదురుగా ఉంటుంది. స‌ముద్రం ప‌క్క‌నే ఉన్న ఇల్లు కావ‌డంతో ఎంతో ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంది. ఆప‌క్కనే అక్ష‌య్ కుమార్ ఇల్లు కూడా ఉంది. ప్ర‌స్తుతం వ‌రుణ్ ధావ‌న్ ఉంటోన్న ఇంటిని 2017 లో కొనుగోలు చేసాడు.

ఇది కూడా జుహూ ప్రాంతంలోనే ఉంటుంది. కానీ దీనికి బీచ్ వ్యూ లేన‌ట్లు స‌మాచారం. ఇప్పుడా బీచ్ వ్యూ కోస‌మే ప్ర‌త్యేకంగా అక్క‌డికి షిప్ట్ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఇది అద్దెకు తీసుకున్నాడా? లేక స్నేహం కొద్ది హృతిక్ కొన్నాళ్ల పాటు ఉండండి? అని అన్నాడా? అన్న‌ది తెలియ‌దు. ప్ర‌స్తుతం న‌టుడిగా వ‌రుణ్ ధావ‌న్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.