Begin typing your search above and press return to search.

వరుణ్ -లావణ్య త్రిపాఠి పెళ్లి శుభ‌లేఖ‌

వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. వీరి పెళ్లికి ముందు ప్రీవెడ్డింగ్ వేడుక‌లు ఇప్ప‌టికే మొద‌ల‌య్యాయి

By:  Tupaki Desk   |   27 Oct 2023 3:45 AM GMT
వరుణ్ -లావణ్య త్రిపాఠి పెళ్లి శుభ‌లేఖ‌
X

వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. వీరి పెళ్లికి ముందు ప్రీవెడ్డింగ్ వేడుక‌లు ఇప్ప‌టికే మొద‌ల‌య్యాయి. తాజాగా పెళ్లి ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలో జరగనున్న వివాహ వేడుక వివరాలను వెడ్డింగ్ ఇన్విటేష‌న్ లో వెల్లడించారు. ఇందులో హైద‌రాబాద్ లోని ప్ర‌ముఖుల కోసం ప్ర‌త్యేక విందు కార్య‌క్ర‌మం తేదీని కూడా ఫిక్స్ చేసార‌ని అర్థ‌మ‌వుతోంది.


పెండ్లి శుభ‌లేఖ‌ వెండి - బంగారం థీమ్‌తో ఎంతో అందంగా ఉంది. అయితే ఇది వివాహానికి ముందు జరిగే వేడుకల థీమ్‌గా కనిపిస్తోంది. ఆహ్వానం వరుడి వైపు నుండి వచ్చినట్లు కనిపిస్తోంది. ఫంక్షన్ల గురించి చాలా వివరాలు ఇవ్వకుండా లీక్ మాత్ర‌మే ఇచ్చారు. ఆహ్వానంలో చిరంజీవి కొణిదెల, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ నుండి 'ఉత్తమ అభినందనలతో' అని ముద్రించి ఉండ‌డం విశేషం. అందులో 'శ్రీమతి పద్మజ & శ్రీ కొణిదెల నాగబాబు తమ ముద్దుల కొడుకు వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి వివాహ రిసెప్షన్ సందర్భంగా దయతో హాజరు కావాలని అభ్యర్థ‌న‌'' అని రాసి ఉంది.

అక్టోబర్ 30 నుంచి వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. మెగా ఫ్యామిలీ మొత్తం కొద్దిరోజుల క్రితం ఇటలీలోని టస్కానీకి చేరుకుంది. మరొక ప్రీ వెడ్డింగ్ వేడుక కోసం ఉత్సవాలు టుస్క‌నీలో ప్రారంభమవుతాయి. ''ఈ జంట అక్టోబర్ 30వ తేదీన ఇటలీలోని టుస్కానీలోని సుందరమైన ప్రాంతంలో వారి వివాహానికి సంబంధించిన మొదటి ఈవెంట్ గా కాక్‌టెయిల్ పార్టీని నిర్వహించనున్నారు'' అని అంతర్గత సోర్స్ చెబుతోంది.

కాక్‌టెయిల్ నైట్ అనంత‌ర రోజుల్లో మెహందీ, హల్దీ వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి. కాక్ టైల్ పార్టీ ఇటాలియ‌న్ స్టైల్ లో రొమాంటిక్ గా ప్లెజెంట్ గా ఉండనుంది. తర్వాత అక్టోబర్ 31న మెహందీ, హల్దీ నైట్ వేడుక‌లు సాగుతాయి. తాజా క‌థ‌నాల‌ ప్రకారం... ఈ జంట బంధువులు, కుటుంబ సభ్యులలో ముఖ్యులైన‌ అల్లు అర్జున్, రామ్ చరణ్, ఉపాసన, సాయి ధరమ్ త‌దితరులు టుస్కానీకి విచ్చేసారు.