Begin typing your search above and press return to search.

లావ‌ణ్య ప్రేమ‌లో వ‌రుణ్ అలా లాక్ అయ్యాడు!

తాజాగా ఓ సినిమా ప్ర‌చారంలో బిజీగా ఉన్న వ‌రుణ్ ని.... లావ‌ణ్య తో ప్రేమ ఎప్పుడు మొద‌లైంద‌ని ఫేస్ టూ ఫేస్ అడ‌గ‌గా...ఆమెతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ్డ‌ట్లు వ‌రుణ్ తెలిపాడు.

By:  Tupaki Desk   |   24 Aug 2023 5:10 AM GMT
లావ‌ణ్య ప్రేమ‌లో వ‌రుణ్ అలా లాక్ అయ్యాడు!
X

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లికి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో గ్రాండ్ గా నిశ్చితార్దం జ‌రిగింది. మూడు మూళ్లు..ఏడు అడుగులు..వేద మంత్రాలు మాత్ర‌మే మిగిలున్నాయి. డిసెంబ‌ర్ లో ఆ తంతు కూడా పూర్త‌వుతుంది. ఇదంతా చాలా వేగంగానే జ‌రిగిపోయింది. మీడియాలో క‌నీసం గాసిప్ కూడా తావు ఇవ్వ‌కుండా ఇద్ద‌రు ప్రేమించు కున్నారు. ఇద్ద‌రిపై ఏ నాడు ల‌వ్ లో ఉన్నారు? అన్న ప్ర‌చారం రాలేదు.

క‌ట్ చేస్తే ఏకంగా ఏంగేజ్ మెంట్ అంటూ ఫోటోలో రిలీజ్ చేసి షాక్ ఇచ్చారు. ఇప్ప‌టికీ ఎవ‌రు? ఎవ‌ర్నీ ముందుగా ప్ర‌పోజ్ చేసారు? తొలిసారి ఎక్క‌డ క‌లుసుకున్నారు? మొద‌టి గిఫ్ట్ ఇచ్చింది ఎవ‌రు? ఇలా సందేహాలున్నాయి. వాటి గురించి అభిమానులు అడిగానా విష‌యం మాత్రం చెప్ప‌డం లేదు. తాజాగా ఓ సినిమా ప్ర‌చారంలో బిజీగా ఉన్న వ‌రుణ్ ని.... లావ‌ణ్య తో ప్రేమ ఎప్పుడు మొద‌లైంద‌ని ఫేస్ టూ ఫేస్ అడ‌గ‌గా...ఆమెతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ్డ‌ట్లు వ‌రుణ్ తెలిపాడు.

అదీ ఎంతో సిగ్గు ప‌డుతూ స‌మాధానం ఇచ్చాడు మెగా వార‌సుడు. మ‌రి తొలిసారి లావ‌ణ్య‌ని ఎక్క‌డ చూసాడు? ఎలా ప్ర‌పోజ్ చేసాడు? వంటి విష‌యాలు మాత్రం చెప్ప‌లేదు. అలాగే పెళ్లి విష‌యం మాత్రం రివీల్ చేసాడు. ఇదే ఏడాది పెళ్లి చేసుకుంటాన‌ని ...తాను న‌టించిన సినిమాల రిలీజ్ అనంత‌రం అదే ప‌నిలో ఉంటాన‌న్నాడు. లావ‌ణ్య త్రిపాఠి న‌టిగా వ‌రుణ్ కంటే సీనియ‌ర్. అమ్మ‌డు 2012లో 'అందాల రాక్ష‌సి' సినిమాతో ప‌రిచ‌య‌మైంది. వ‌రుణ్ రెండేళ్ల గ్యాప్ అనంత‌రం 2014 లో 'ముకుంద‌'తో ప‌రిచ‌య‌మ‌య్యాడు.

ఇద్ద‌రి మ‌ధ్య వ‌య‌సు వ్య‌త్యాసం కూడా ఏడాదే. ఒక సంవ‌త్స‌రం మాత్ర‌మే వ‌రుణ్ ..లావ‌ణ్య క‌న్నా పెద్ద‌. అయితే ఈ విష‌యంలో చిన్న క‌న్ ప్యూజ‌న్ కూడా రెయిజ్ అవుతుంది. వ‌రుణ్ క‌న్నా...లావ‌ణ్య ఏడాది పెద్ద‌ద‌ని సోష‌ల్ మీడియాలో కొన్ని పోస్ట్లు వైర‌ల్ అవుతున్నాయి. అయినా ప్రేమ పెళ్లిళ్ల విష‌యంలో వ‌య‌సు అడ్డంకి కాద‌ని చాలా మంది సెల‌బ్రిటీలు నిరూపించిన సంగ‌తి తెలిసిందే.