Begin typing your search above and press return to search.

వరుణ్ లవ్.. స్టైలిష్ లుక్స్ లో కిర్రాక్ జోడి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బ్యూటిఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవల ఇటలీలో గ్రాండ్ గా వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో మునిగితేలిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   27 Nov 2023 4:23 PM GMT
వరుణ్ లవ్.. స్టైలిష్ లుక్స్ లో కిర్రాక్ జోడి
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బ్యూటిఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవల ఇటలీలో గ్రాండ్ గా వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో మునిగితేలిన విషయం తెలిసిందే. ఇక ఈ జంట వారి కమిట్మెంట్స్ ప్రకారం ఇండియా కు రాగానే మళ్లీ ఎప్పటిలానే షూటింగ్స్ లో బిజీ అయ్యారు. ఇక అప్పుడప్పుడు ఫ్యాన్స్ కోసం అయితే వారు ప్రత్యేకంగా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉన్నారు.


ముఖ్యంగా లావణ్య త్రిపాఠి మరింత గ్లామరస్ గా ఎప్పటికప్పుడు ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్టులో అయితే చేరిపోతుంది. ఇక రీసెంట్ వరుణ్ లవ్ ఇద్దరు కలిసి మరొక స్పెషల్ ఫోటోషూట్ లో పాల్గొన్నారు. అందులో ఇద్దరు కూడా బ్రిటిష్ లుక్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.


వరుణ్ తేజ్ స్టైలిష్ గా సుటూ బూటుతో ఇంగ్లీష్ క్వీన్ గా సిద్ధమైన లవణ్యతో పోటోకు స్టిల్ ఇచ్చాడు. ఇక ఈ ఫోటోలు అలా పోస్ట్ చేశారో లేదో నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. పెళ్లి తర్వాత ఈ జంట మరింత జోష్ గా ఎప్పటికప్పుడు ఇలా వారి ఫాలోవర్స్ కు ఆనందాన్ని కలిగిస్తూనే ఉంది. ఇక చూడముచ్చటైన జంటను చూసినా అభిమానులు చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

ఇదివరకే వీరు ఇద్దరు కూడా ఎంతో అందంగా కనిపించేవారు. ఇక పెళ్లి తర్వాత వారి ప్రేమ తో మరింత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు అని ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు. ఇక ఇటలీలో నవంబర్ ఒకటవ తేదీన హిందూ సంప్రదాయ ప్రకారం లావణ్య వరుణ్ తేజ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ వేడుకకు మెగా ఫ్యామిలీలోని హీరోలందరూ కూడా పాల్గొన్నారు. ఇక అంతే కాకుండా లావణ్య త్రిపాఠి ఫ్యామిలీకి సంబంధించిన వారు కూడా వేడుకలు పాల్గొన్నారు. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ తో పాటు లావణ్య కూడా సినిమా షూటింగ్ లతో బిజీ అవుతుంది. వరుణ్ తేజ్ నెక్స్ట్ ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా రాబోతున్నాడు. ఇక మట్కా అనే సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది.