Begin typing your search above and press return to search.

తండ్రీకొడుకులిద్ద‌రు పెద్ద ప్లాన్ వేసారే!

తాజాగా ఈ ద్వ‌యం డ‌బుల్ హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. త్వ‌ర‌లో ఇద్ద‌రు క‌లిసి వ‌రుస‌గా రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

By:  Tupaki Desk   |   5 April 2024 1:30 PM GMT
తండ్రీకొడుకులిద్ద‌రు పెద్ద ప్లాన్ వేసారే!
X

బాలీవుడ్ లో డాడ్ అండ్ స‌న్ డేవిడ్ ధావ‌న్-వ‌రుణ్ ధావ‌న్ కాంబినేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఉత్త‌రాది ఇండ‌స్ట్రీని ఏలేస్తోన్న తండ్రీకొడుకుల జోడీ ఇది. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన 'మే తేరా హీరో'-' జుడ్వా-2'.. 'కూలీనెం-1' చిత్రాలు ఎంత పెద్ద విజ‌యం సాధించాయో తెలిసిందే. వ‌రుస‌గా మూడు సినిమాల విజ‌యంతో తొలి హ్యాట్రిక్ న‌మోదైంది. ఇండ‌స్ట్రీలో ఇలా స‌క్సెస్ అవ్వ‌డం అన్న‌ది ఇంత‌వ‌ర‌కూ చోటు చేసుకోలేదు.

తొలిసారి ఆ రికార్డు అ తండ్రి-కొడుకుల సొంతం అన‌డం అతిశ‌యోక్తి లేదు. తాజాగా ఈ ద్వ‌యం డ‌బుల్ హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. త్వ‌ర‌లో ఇద్ద‌రు క‌లిసి వ‌రుస‌గా రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఓ ప్రాజెక్ట్ చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉంద‌ని కొన్ని నెల‌ల క్రితం ప్ర‌చారం సాగింది. తాజాగా ఒక‌టి కాదు..ఏకంగా రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్రేమ‌...కామెడీ..కుటుంబ అనుబంధాల నేప‌థ్యంలో ఓ సినిమా ప్లాన్ చేయ‌గా..మ‌రో సినిమాకి సంబంధించిన అప్ డేట్ తెలియాల్సి ఉంది.

వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారుట‌. ఆవెంట‌నే అనుకున్న ఐద‌వ చిత్రం కూడా తెర‌కెక్కించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఈ రెండు విజ‌యం సాధిస్తే గ‌నుక మిగిలిన ఒక్క సినిమాతో డ‌బుల్ హ్యాట్రిక్ కి పెద్ద‌గా స‌మ‌యం తీసుకునే అవ‌కాశం లేదు. స‌రైన స‌మ‌యం చూసుకుని ఆ ప్రాజెక్ట్ ని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం వ‌రుణ్ ధావ‌న్ 'బేబిజాన్' అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నాడు.

ఇక డేవిడ్ ధావ‌న్ మూడేళ్ల‌గా ద‌ర్శ‌క‌త్వానికి దూరంగా ఉన్నారు. చివ‌రిగా 'కూలీనెంబ‌ర్ వ‌న్' త‌ర్వాత సినిమా సినిమాలు చేయ‌లేదు. మ‌ళ్లీ ఇంత‌కాలానికి త‌న‌యుడితో కంబ్యాక్ ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మూడు ద‌శాబ్ధాల క్రిత‌మే డేవిడ్ ధావ‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌మై ఎన్నో హిట్ సినిమాలు తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.