Begin typing your search above and press return to search.

అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ షురూ

ఇప్ప‌టికే అట్లీతో సినిమాలు చేయాల‌ని కొంద‌రు టాలీవుడ్ స్టార్ హీరోలు ఆస‌క్తిగా ఉన్నారు

By:  Tupaki Desk   |   27 July 2023 11:30 PM GMT
అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ షురూ
X

కోలీవుడ్ సంచ‌ల‌నం అట్లీ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే నాలుగు విజ‌యాలు వ‌రుస‌గా ఖాతాలో వేసుకుని డ‌బుల్ హ్యాట్రిక్ పై కన్నేసాడు. ప్ర‌స్తుతం షారుక్ ఖాన్ తో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'జ‌వాన్' తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా విజ‌యంతో అట్లీ రేంజ్ మారిపోతుంద‌ని భారీ అంచ‌నాలున్నాయి. ఇండియ‌న్ గ్రేట్ డైరెక్ట‌ర్ల‌లో అట్లీ పేరు చేరుతుంద‌ని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఈ నేప‌థ్యంలో అట్లీ ప్లానింగ్ కూడా అలాగే చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టికే అట్లీతో సినిమాలు చేయాల‌ని కొంద‌రు టాలీవుడ్ స్టార్ హీరోలు ఆస‌క్తిగా ఉన్నారు. వాళ్ల షెడ్యూల్ బిజీగా ఉన్న ఇలాంటి మేక‌ర్ తో ఒక్క సినిమా చేసినా బావుటుంది అన్న ఆలోచ‌న‌లో ఉన్నారు. అయితే అట్లీ మాత్రం బాలీవుడ్ హీరోల్నే టార్గెట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. 'జ‌వాన్' త‌ర్వాత వ‌రుణ్ ధావ‌న్ తో ఓ సినిమా తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లే రిలీజ్ అయిన‌ 'బ‌వాల్' సినిమాతో మ‌రో స‌క్సెస్ ఖాతాలో వేసుకున్న వ‌రుణ్ ధావ‌న్ తాజాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ విష‌యాలు రివీల్ చేసాడు.

'నా 18వ సినిమా అట్లీతో ఉంటుంది. ఇలాంటి క‌థ నాకు ఇంత వ‌ర‌కూ రాలేదు. నాకే కాదు ప్రేక్ష‌కుల‌కు అంత‌కు మించి కొత్త అనుభూతిని పంచే సినిమా. ఇదొక మాస్ ఎంటర్ టైన‌ర్. నేను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే అంశాలెన్నో ఉన్నాయి. ఇంత‌కు మించి ఈప్రాజెక్ట్ గురించి ఒకే విష‌యాలు ఇప్పుడే చెప్ప‌లేను. అట్లీతో ప‌నిచేయ‌డానికి సిద్దంగా ఉన్నాను. ' అని అన్నారు. ఈ చిత్రాన్ని క‌బీర్ సింగ్ నిర్మాత ముర‌ద్ కేత‌ని నిర్మిస్తున్నారు.

దీంతో అట్లీ-వ‌రుణ్ ధావ‌న్ కాంబినేష‌న్ షురూ అయింద‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి 'జ‌వాన్' త‌ర్వాత అట్లీ కోలీవుడ్...టాలీవుడ్ హీరోల‌తో సినిమాలు చేస్తాడ‌ని ప్రచారం సాగింది. కానీ వాటికి ట్విస్ట్ ఇస్తూ త‌దుప‌రి చిత్రాన్ని కూడా బాలీవుడ్ హీరోతోనే తెర‌పైకి తెచ్చాడు. 'జ‌వాన్' త‌ర్వాత వెంట‌నే ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌బోతుంది.