Begin typing your search above and press return to search.

మెగా కొత్త పెళ్లి కొడుకు బయటకు...!

షూటింగ్స్‌ కి కొన్నాళ్లుగా బ్రేక్ ఇచ్చిన ఈ కొత్త పెళ్లి కొడుకు ఎట్టకేలకు కెమెరా ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

By:  Tupaki Desk   |   26 Nov 2023 8:53 AM GMT
మెగా కొత్త పెళ్లి కొడుకు బయటకు...!
X

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ సినీ కెరీర్‌ పరంగా కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న కూడా వ్యక్తిగతంగా మాత్రం ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని తన ప్రేమను సూపర్‌ హిట్ చేసుకున్నాడు. హీరోయిన్‌ లావణ్య త్రిపాఠితో ఉన్న తన ప్రేమను సూపర్ సక్సెస్ చేసుకుని, కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత వైభవంగా ఇటలీలో పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే.

పెళ్లికి ముందు తర్వాత కలిపి దాదాపుగా మూడు నెలల పాటు వరుణ్‌ సినిమాలకు దూరంగా ఉన్నాడు. షూటింగ్స్‌ కి కొన్నాళ్లుగా బ్రేక్ ఇచ్చిన ఈ కొత్త పెళ్లి కొడుకు ఎట్టకేలకు కెమెరా ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే వరుణ్‌ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్‌' షూటింగ్‌ ను పూర్తి చేసిన విషయం తెల్సిందే.

ఆ సినిమా విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు ఒక వైపు జరుగుతున్నాయి. ఆ సినిమా కోసం తన వర్క్ అంతా పూర్తి చేసిన వరుణ్‌ విడుదల సమయంలో ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు అవ్వాల్సి ఉంది. ఇక తన మరో సినిమా మట్కా షూటింగ్ కి వరుణ్ డేట్లు ఇచ్చాడు. ముందుగా అనుకున్న ప్రకారంగానే డిసెంబర్‌ లో మట్కా కోసం కెమెరా ముందుకు వరుణ్‌ రాబోతున్నాడట. పెళ్లి తర్వాత మొదటి సారి వరుణ్ బయటకు వచ్చి కెమెరా ముందు కనిపించబోతున్నాడు.

ఆ సినిమా కోసం వరుణ్‌ ఫిజిక్ లో చాలా మార్పులు రావాల్సి ఉందట. దర్శకుడు కరుణ కుమార్‌ రూపొందించిన కథ లో హీరో పాత్ర కి అనుగుణంగా వరుణ్ ఇప్పటికే తన ఫిజిక్ ను మార్చుకున్నాడు. డిసెంబర్‌ నుంచి షూటింగ్ కి హాజరు అవ్వబోతున్నాడు కనుక అప్పటి వరకు మరింతగా వరుణ్‌ తన ఫిజిక్ ను ఆ పాత్ర కోసం సిద్ధం చేస్తాడని అంటున్నారు

ప్రస్తుతం ట్రైనర్స్ సమక్షంలో జిమ్‌ లో వర్కౌట్‌ లు చేస్తున్న వరుణ్ తేజ్‌ కొత్త లుక్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. మట్కా సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు పేర్కొన్నాడు. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథ ను రూపొందించినట్లు తెలుస్తోంది.

రెండు మూడు డిఫరెంట్ ఏజ్‌ గ్రూప్‌ లో వరుణ్‌ కనిపిస్తాడని కూడా అంటున్నారు. మొత్తానికి మట్కా తో వరుణ్‌ తేజ్ పాన్‌ ఇండియా రేంజ్ లో సత్తా చాటడం ఖాయం అంటూ మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.

మీనాక్షి చౌదరి మరియు నోరా ఫతేహి లు హీరోయిన్స్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నారట. డిసెంబర్‌ లో షూటింగ్ ప్రారంభించి 2024 సమ్మర్ తర్వాత సినిమాను విడుదల చేసే విధంగా దర్శకుడు కరుణ కుమార్‌ ప్లాన్‌ చేస్తున్నాడని సమాచారం అందుతోంది.