Begin typing your search above and press return to search.

కొరియా దారిలో వరుణ్ తేజ్ హారర్ కథ!

ప్రతి సినిమాలో కొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తూ తనదైన స్టైల్‌ను కొనసాగిస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌తో సిద్ధమవుతున్నాడు.

By:  Tupaki Desk   |   24 May 2025 12:12 PM
కొరియా దారిలో వరుణ్ తేజ్ హారర్ కథ!
X

ప్రతి సినిమాలో కొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తూ తనదైన స్టైల్‌ను కొనసాగిస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌తో సిద్ధమవుతున్నాడు. మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌కి వర్కింగ్ టైటిల్‌గా #VT15 ఫిక్స్ అయ్యింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది.


ఇండో-కొరియన్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సత్య, మిర్చి కిరణ్‌ వంటి కామెడీ టాలెంట్ తో కూడిన బలమైన టీమ్ ఈ చిత్రంలో భాగమవుతోంది. వేరే లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించేందుకు దర్శకుడు గాంధీ వినూత్న కథనాన్ని తెరపైకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే హైదరాబాద్, అనంతపురం షెడ్యూల్‌లను పూర్తి చేసుకున్న చిత్రబృందం త్వరలో కొరియా షెడ్యూల్‌కి వెళ్లనుంది. హైద‌రాబాద్‌లో పూజా కార్యక్రమంతో షూటింగ్‌ మొదలైంది. అనంతపురంలోని ప్రాచీన వాతావరణాన్ని కలిగిన విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లలో వరుణ్-రితికలపై ఓ మాస్ పాటను కూడా చిత్రీకరించారు. షూటింగ్‌లో భాగంగా బలమైన ఎమోషన్లు, కామెడీతో కూడిన సన్నివేశాలు తెరపైకి వచ్చాయి.

సినిమా మొదటి భాగాన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో ఆకట్టుకునేలా చిత్రీకరించినట్లు సమాచారం. ఇక మూడో షెడ్యూల్‌లో భాగంగా కొరియా వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్కడే ఈ సినిమాలో కీలకమైన హారర్ సీన్స్ ను చిత్రీకరించనున్నారు. భారతీయ - కొరియన్ కలయికతో ఈ చిత్రానికి ఓ ఇంటర్నేషనల్ టోన్ ఇవ్వాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇటీవలి కాలంలో ఈ తరహా క్రాస్ కల్చర్ చిత్రాలు అరుదు కావడంతో VT15పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్స్‌ను బట్టి చూస్తే.. ఇదో ఫన్, ఫియర్ మిక్స్‌ అయిన కథాంశమని అర్థమవుతోంది. వరుణ్ తేజ్‌కు ఇది పూర్తిగా కొత్త యాంగిల్‌గా నిలవనుందని అభిమానులు భావిస్తున్నారు. కామెడీ, హారర్ ఎలిమెంట్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ కొత్త థ్రిల్ ఇచ్చే విధంగా సినిమా ఉండబోతోందన్న హింట్ టీజర్‌ నుంచే వచ్చేసింది. వివిధ షెడ్యూల్స్‌తో స్పీడ్‌గా షూటింగ్ సాగుతున్న #VT15 వచ్చే ఏడాది సమ్మర్‌లో థియేటర్లలో విడుదలయ్యే అవకాశముంది.