Begin typing your search above and press return to search.

వరుణ్- గాంధీ మూవీ.. కొత్త అప్డేట్ ఏంటంటే?

ఇండో - కొరియన్‌ హారర్‌ కామెడీ ఫిల్మ్‌ గా రానున్న VT 15 ప్రాజెక్ట్ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది.

By:  Tupaki Desk   |   5 July 2025 11:37 AM IST
వరుణ్- గాంధీ మూవీ.. కొత్త అప్డేట్ ఏంటంటే?
X

మెగా హీరో వరుణ్ తేజ్.. సరైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. విభిన్నమైన జోనర్లలో సినిమాలు చేస్తున్నా.. అనుకున్నట్లు మాత్రం మెప్పించలేకపోతున్నారు. ఆపరేషన్ వాలంటైన్, మట్కా వంటి మూవీస్ చేసినా ఆశించిన మేరకు ఆకట్టుకోలేకపోతున్నారు. బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్స్ అందుకుంటున్నారు.


ఇప్పుడు భిన్నమైన కాన్సెప్ట్‌ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు వరుణ్ తేజ్. ఎక్స్‌ ప్రెస్‌ రాజా, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఏక్ మినీ కథ వంటి చిత్రాలను తెరకెక్కించిన మేర్లపాక గాంధీతో ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు. ఇండో - కొరియన్‌ హారర్‌ కామెడీ ఫిల్మ్‌ గా రానున్న VT 15 ప్రాజెక్ట్ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది.

ఇప్పటికే హైదరాబాద్ తో పాటు అనంతపురం షెడ్యూల్స్ ను మేకర్స్ పూర్తి చేశారు. తాజాగా ఫారిన్ షెడ్యూల్ ను మొదలుపెట్టారు. ప్రస్తుతం విదేశాల్లో వరుణ్ తేజ్ సహా సినిమాలోని ప్రధాన తారాగణంపై అత్యంత వినోదాత్మక, పవర్ ఫుల్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. సూపర్ బ్యాక్ డ్రాప్ లో స్టన్నింగ్ కంటెంట్ ను మేకర్స్ చిత్రీకరిస్తున్నారు.

మూవీకి ఇంటర్నేషనల్ టచ్ కూడా ఫారిన్ షెడ్యూల్ తో ఇస్తున్నారు మేకర్స్. సినిమాను అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ పూర్తయిన తర్వాత.. షూటింగ్ 80 శాతం పూర్తైనట్లవుతుంది. మిగతాది కూడా త్వరలో కంప్లీట్ చేయనున్నారు.

అయితే మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న VT15 ప్రాజెక్ట్ ను యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మేర్లపాక గాంధీతోపాటు UV క్రియేషన్స్‌తో కలిసి వరుణ్ తేజ్ చేస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. కంచె తర్వాత ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ తో ఇప్పుడు మరోసారి వర్క్ చేస్తున్నారు.

ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. రితికా నాయక్, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారితోపాటు మరికొందరు టాలెంటెడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. వారికి సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. మరికొద్ది రోజుల్లో టైటిల్ ను రివీల్ చేయనున్నారు. గ్లింప్స్ కూడా విడుదల చేయనున్నారు. మరి అవి ఎప్పుడు వస్తాయో వేచి చూడాలి.