ఆ డైరెక్టర్ మెగా వారసుడిని టచ్ చేస్తున్నాడా?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సక్సెస్ కోసం పోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా చేసిన సినిమాలేవి కలిసి రావడం లేదు.
By: Tupaki Desk | 29 May 2025 12:22 PM ISTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సక్సెస్ కోసం పోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా చేసిన సినిమాలేవి కలిసి రావడం లేదు. దీంతో వరుస ప్లాప్ లు ఖాతాలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం మేర్ల పాక గాంధీ దర్శకత్వంలో `కొరియన్ కనకరాజు` అనే చిత్రం చేస్తున్నాడు. గాంధీ కూడా ప్లాప్ ల్లో ఉన్నా? స్టోరీపై నమ్మకంతో పాటు గత సక్సెస్ లపై కాన్పిడెన్స్ తో ముందుకెళ్తున్నాడు.
ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది. త్వరలోనే కొరియా ప్టైట్ ఎక్కనున్నారు. అక్కడ ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే వరుణ్ తేజ్ కొత్త ప్రాజెక్ట్ కోసం చర్చలు షురు చేసినట్లు తెలుస్తోంది. రవితేజ తో `టచ్ చేసి చూడు` చిత్రాన్ని తెరకెక్కించిన విక్రమ్ సిరికొండకు మెగా వారసుడు క్లియరెన్స్ ఇచ్చినట్లు వినిపిస్తుంది. డైరెక్టర్ గా సిరికొండకు అదే తొలి సినిమా.
కానీ ప్లాప్ అయింది. బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. రైటర్ గా సిరికొండకు స్టార్ హీరోల సినిమాలకు పని చేసిన అనుభవం ఉంది. రవితేజ అవకాశం కూడా ఆ ట్రాక్ రికార్డు చూసే ఇచ్చాడు. కానీ వైఫల్యం తప్ప లేదు. తాజాగా వరుణ్ తేజ్ కూడా సిరికొండకు అవకాశం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఏడేళ్ల పాటు కెప్టెన్ కుర్చీకి దూరంగా ఉన్నా? మెగా ప్రిన్స్ కమిట్ అయినట్లు తెలుస్తోంది.
ప్రయోగాలు చేయడంలో మెగా వారసుడు ముందుంటాడని చెప్పాల్సిన పనిలేదు. కాన్సెప్ట్ కొత్తగా ఉంటే మిగతా విషయాలేవి పెద్దగా ఆలోచించచడు. ఓ రకంగా ప్రయోగాలు ఆయనకు మంచి పేరే తీసుకొచ్చాయి. ప్లాప్ లు వచ్చినా? వరుణ్ తేజ్ గురించి స్పెషల్ గా మాట్లాడుకుంటున్నారంటే అతడిలో ఆ డేరింగ్ స్టెప్ కారణంగానే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడానికి ముందుకొస్తుందిట.
