లావణ్య బేబీ బంప్ రివీల్.. వీడియో వైరల్
హైదరాబాద్ శంశాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిందీ జంట. ఈ క్రమంలోనే లావణ్య బేబీ బంప్ కనిపించింది.
By: Tupaki Desk | 26 July 2025 11:08 AM ISTటాలీవుడ్ క్యూట్ కపుల్ లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జోడీ ఒకటి. త్వరలో ఈ ఇద్దరూ పేరెంట్స్ గా ప్రమోషన్ పొందనున్న విషయం తెలిసిందే. అయితే ప్రెగ్నెన్సీ టైమ్ ను లావణ్య ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె కోసం భర్త వరుణ్ కూడా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి సమయం ఇస్తున్నారు. భార్య లావణ్యతో ఎక్కువ సమయం గడిపేందుకే వరుణ్ ప్రాధాన్యత ఇస్తున్నారు.
తరచూ సతీమణి లావణ్యతో వీదేశీ ట్రిప్ లకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మధ్య వరుణ్, లావణ్య ఫారిన్ ట్రిప్ నకు వెళ్లింది. ఈ ట్రిప్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఈ జంట ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా వెకెషన్ నుంచి రిటర్న్ వచ్చారు.
హైదరాబాద్ శంశాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిందీ జంట. ఈ క్రమంలోనే లావణ్య బేబీ బంప్ కనిపించింది. ఫారిన్ ట్రిప్ ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న వరుణ్, లావణ్య సరదాగా ముచ్చటిస్తూ తమ కారు వైపునకు నడిచారు. సరదాగా మాట్లాడుతూ కారులో ఎక్కి వెళ్లిపోయారు.
ఈ సమయంలో లావణ్య పింక్ కలర్ హుడ్డీలో కనిపించగా, వరుణ్ క్యాజువల్ షర్ట్, జీన్స్ ధరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన మెగా ఫ్యాన్స్, నెటిజన్లు అడ్వాన్స్ గా వరుణ్, లావణ్యకు కంగ్రాజ్యులేషన్స్ చెబుతున్నారు.
కాగా, ఈ ఇద్దరి మధ్య మిస్టర్ సినిమా సమయంలో స్నేహం కుదిరింది. ఆ తర్వాత అంతరిక్షం సినిమాలోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత వీరి లవ్ కన్ఫార్మ్ చేశారు. ఇరు కుటుంబాల అంగీకారంతో 2023లో వరణ్, లావణ్య ఘనంగా వివాహ బంధంతో ఒక్కటైయ్యారు.
మరోవైపు, వరుణ్ మేర్లపాక గాంధీ సినిమాలో నటిస్తున్నారు. ఇది హార్రర్ కామెడీ జానర్ గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా సినిమాపై అప్డేట్ ఇచ్చారు. మ్యూజిక్ కు సంబంధించిన పనులు జరుగుతున్నాయని తమన్ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు.
