అప్పుడే వరుణ్ ఓ కొలిక్కి తెచ్చాడా?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు ఎంత కష్టపడినా దానికి తగ్గ ఫలితం దక్కకుండా పోతుంది. గత కొన్ని సినిమాలుగా వరుణ్ వరుస ఫ్లాపులను అందుకుంటున్నాడు.
By: Tupaki Desk | 16 Jun 2025 11:00 AM ISTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు ఎంత కష్టపడినా దానికి తగ్గ ఫలితం దక్కకుండా పోతుంది. గత కొన్ని సినిమాలుగా వరుణ్ వరుస ఫ్లాపులను అందుకుంటున్నాడు. ఎప్పటికప్పుడు తను చేసే సినిమాపై అంచనాలను పెట్టుకోవడం, ఆ సినిమా రిలీజయ్యాక అది వరుణ్ ను నిరాశ పరచడం కామనైపోయింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ మార్కెట్ చాలా డల్ గా ఉంది.
దీన్ని అధిగమించాలంటే వరుణ్ కు ఇప్పుడు అర్జెంటుగా ఓ హిట్ కావాలి. అందులో భాగంగానే ఈసారి కామిక్ ఎంటర్టైనర్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ తో వరుణ్ ప్రస్తుతం సినిమా చేస్తున్నాడు. వరుణ్ కెరీర్ లో 15వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మేకర్స్ కొరియన్ కనకరాజు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.
ఈ సినిమా కోసం వరుణ్ కొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ మొత్తం కొరియా వెళ్లింది. కొరియన్ కనకరాజు సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ఇవాళ నుంచి కొరియాలో మొదలవనుంది. 45 రోజుల పాటూ కొనసాగనున్న ఈ లాంగ్ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ దాదాపు 90% పూర్తవుతుందని తెలుస్తోంది.
కొరియన్ షెడ్యూల్ పూర్తయ్యాక మిగిలిన షూటింగ్ ను హైదరాబాద్ లో చేయనున్నారు. ఎలాగైనా సినిమాను ఆగస్ట్ నాటికి పూర్తి చేసి సెప్టెంబర్ నుంచి కొత్త సినిమాను మొదలుపెట్టాలని వరుణ్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియోనే ఎంతో ఎంటర్టైనింగ్ గా ఉండటంతో కొరియన్ కనకరాజుపై అందరికీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో సత్య కామెడీ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని ఆల్రెడీ టాక్ వినిపిస్తోంది. హార్రర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా, వచ్చే ఏడాది ఫస్టాఫ్ లో ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలున్నాయి.
