Begin typing your search above and press return to search.

హర్రర్‌ కనకరాజు కోసం జాంబీ ఐటెం...!

కొరియన్ కనకరాజు సినిమాలో వరుణ్ తేజ్‌కి జోడీగా రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే ఆమె షూటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం అందుతోంది.

By:  Tupaki Desk   |   30 April 2025 5:33 AM
హర్రర్‌ కనకరాజు కోసం జాంబీ ఐటెం...!
X

వరుణ్‌ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న హర్రర్ కామెడీ మూవీ 'కొరియన్ కనకరాజు'. ఈ సినిమాను ఇటీవల ప్రారంభించారు. కొన్ని రోజుల క్రితం సినిమా షూటింగ్‌ ప్రారంభంకు సంబంధించిన వీడియోను విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అనౌన్స్మెంట్‌ వీడియోతోనే సోషల్‌ మీడియాలో సినిమా గురించి పాజిటివ్‌ బజ్ కలిగేలా మేకర్స్ చేశారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్‌తో పాటు కీలక పాత్రలో కమెడియన్‌ సత్య కనిపించబోతున్నాడు. అనౌన్స్మెంట్‌ వీడియలో ఆయన కామెడీ నవ్వు తెప్పించింది. ఈ మధ్య కాలంలో సత్య నటించిన సినిమాలకు మంచి స్పందన దక్కుతోంది. అతడి కామెడీకి మంచి మార్కులు దక్కుతున్నాయి. అందుకే ఈ సినిమాలో ఆయన కామెడీ ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి.

కొరియన్ కనకరాజు సినిమాలో వరుణ్ తేజ్‌కి జోడీగా రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే ఆమె షూటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం అందుతోంది. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్‌ కూడా కనిపించబోతుంది. ఆ హీరోయిన్‌ మరెవ్వరో కాదు దక్ష నాగర్కర్‌. ఆ మధ్య తేజ సజ్జా, ప్రశాంత్‌ వర్మల కాంబోలో వచ్చిన జాంబీ రెడ్డి సినిమాలో హీరోయిన్‌గా నటించి మెప్పించిన దక్ష ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్నా చితకా పాత్రల్లో కనిపిస్తూ వస్తుంది. ఆ మధ్య నాగార్జున, నాగ చైతన్య సినిమా బంగార్రాజులో ప్రత్యేక పాటలో కనిపించడం ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది.

గత ఏడాది లవ్‌ మి, స్వాగ్‌ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు తాజాగా కొరియన్ కనకరాజు సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్‌గా కాకుండా ఒక ఐటెం సాంగ్‌లో ఈమె కనిపించబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఈమధ్య కాలంలో ఐటెం సాంగ్స్‌లో హీరోయిన్స్‌ నటిస్తున్నారు. ఐటెం సాంగ్స్ చేసిన హీరోయిన్స్‌కి మంచి గుర్తింపు లభిస్తుంది. కనుక దక్ష నాగర్కర్‌కి కచ్చితంగా మంచి స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయి. మేర్లపాక గాంధీ మంచి కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ సినిమాలను చేస్తాడనే టాక్‌ ఉంది. కనుక ఆయన సినిమా హిట్ అయితే, ఆ సినిమాలోని ఈ పాటకు మంచి రెస్పాన్స్ దక్కితే తప్పకుండా ముందు ముందు ఈ అమ్మడు టాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్‌ ఆఫర్లు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో రూపొందుతున్న కొరియన్ కనకరాజు సినిమాలో వరుణ్ తేజ్ లుక్‌ నుంచి మొదలుకుని ప్రతి ఒక్కటి చాలా విభిన్నంగా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. వరుణ్‌ తేజ్‌లోని కామెడీ యాంగిల్‌ ను ఎఫ్‌ 2, ఎఫ్‌ 3 లో చూసిన ప్రేక్షకులు మరోసారి ఈ సినిమాలో ఆయన కామెడీ యాంగిల్‌ను చూస్తారని సమాచారం అందుతోంది. మాస్ ఆడియన్స్‌ను మెప్పించే విధంగా దక్ష ఐటెం సాంగ్‌ ఉండబోతుంది. ప్రస్తుతం ఐటెం సాంగ్ షూటింగ్‌ జరుగుతుందని సమాచారం అందుతోంది. అయితే ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేసే విధంగా మేర్లపాక గాంధీ ప్రయత్నాలు చేస్తున్నాడు.