ప్రశాంత్ వర్మ యూనివర్శ్ లోకి మెగా హీరో!
మెగా వారసుడు వరుణ్ తేజ్ ప్రయోగాలు చేయడంలో ఏమాత్రం వెనుకడుగు వేయని హీరో. మెగా హీరోల్లో అతడు అందుకే స్పెషల్ అయ్యాడు.
By: Tupaki Desk | 6 May 2025 7:30 PMమెగా వారసుడు వరుణ్ తేజ్ ప్రయోగాలు చేయడంలో ఏమాత్రం వెనుకడుగు వేయని హీరో. మెగా హీరోల్లో అతడు అందుకే స్పెషల్ అయ్యాడు. ఎంతో మంది హీరోలున్నా? ఎవరు చేయని ప్రయోగాలు చేసి తనకం టూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రయోగాలన్నీ సక్సెస్ కానప్పటికీ వరుణ్ ఇమేజ్ మాత్రం ఎక్కడా చెక్కు చెదరలేదు. ఇది అతడి ప్రతిభకు తార్కాణం. డిఫరెంట్ జానర్ చిత్రాలు ఫెయిల య్యాయని వరుణ్ వెనక్కి తగ్గడం లేదు.
డిఫరెంట్ కాన్సెప్ట్ లు ఏవీ తన దగ్గరకు వచ్చినా? బాగుంది అంటే నో చెప్పకుండా లాక్ చేస్తున్నాడు. తాజాగా వరుణ్ తేజ్ , ప్రశాంత్ వర్మ యూనివర్శ్ లోకి అడుగు పెడు తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రశాంత్ వర్మ తనకంటూ ఓ యూనివర్శ్ ని క్రియేట్ చేసుకుని సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. వేరు వేరు కథలతో సినిమాలు చేస్తూనే మరోవైపు తన యూనివర్శ్ ని కూడా కంటున్యూ చేసేలా ప్రణాళిక సిద్దం చేసి పెట్టుకున్నాడు.
ప్రస్తుతం `కాంతార` ఫేం రిషబ్ శెట్టితో `జై హనుమాన్` చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇది `హనుమాన్` కి కంటున్యూ గా వస్తున్న చిత్రం. దీన్ని యూనివర్శ్ లో కి తీసుకొచ్చి రకరకాల చిత్రాలు చేయడానికి సంక ల్పించాడు. ఇదే యూనివర్శ్ లో భాగమవ్వాలని మెగాస్టార్ చిరంజీవి సైతం ఆశాభావం వ్యక్తం చేసారు. కానీ ప్రశాంత్ వర్మ ఆలోచనల్లో చిరంజీవి కనిపించలేదు. ఆయన లేకపోయినా వాళ్ల బ్బాయి వరుణ్ తేజ్ ఇప్పుడు ఇదే యూనివర్శ్ లోకి ఎంటర్ అవ్వడం ఇంట్రెస్టింగ్.
పీసీయూ నుంచి చాలా సినిమాలు చేసే అవకాశం ఉంది. అందులో ఓ చిత్రంలో వరుణ్ తేజ్ నటించే అవకాశాలున్నాయి. కానీ అదెప్పుడు జరుగుతుంది? అన్నది మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయిన తర్వాత పీసీయూ పై మరికొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.