Begin typing your search above and press return to search.

బేబీ షాపింగ్ తో మెగా హీరో బిజీ.. ఏదో డైలమాలో ఉన్నాడే!

అయితే ఇప్పుడు వరుణ్.. బేబీ షాపింగ్ తో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   25 July 2025 10:50 AM IST
బేబీ షాపింగ్ తో మెగా హీరో బిజీ.. ఏదో డైలమాలో ఉన్నాడే!
X

మెగా హీరో, టాలీవుడ్ యువ కథానాయకుడు వరుణ్ తేజ్ త్వరలో తండ్రిగా ప్రమోషన్ పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన సతీమణి, హీరోయిన్ లావణ్య త్రిపాఠి గర్భం దాల్చారు. ఈ విషయాన్ని ఇప్పటికే మెగా దంపతులు అనౌన్స్ చేశారు. తాము మరికొద్ది రోజుల్లో పేరెంట్స్ కాబోతున్నట్లు నెట్టింట ప్రకటించారు.


గత కొంతకాలంగా లావణ్య గర్భవతి అంటూ వస్తున్న వార్తలు నిజమేనని ఓ స్పెషల్ ఫోటోతో తేల్చారు. చిన్నారి షూస్‌ తో పాటు వరుణ్, లావణ్య ఒకరి చేతిని ఒకరు పట్టుకుని ఆ పిక్ లో కనిపించారు. జీవితంలో అత్యంత అందమైన పాత్ర పోషించబోతున్నామని, కమింగ్ సూన్ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

దీంతో సినీ ప్రియులు, సెలబ్రిటీలు, ఫ్యామిలీ మెంబర్స్ బెస్ట్ విషెస్ చెప్పారు. వెయిటింగ్ ఫర్ బేబీ అంటూ కామెంట్స్ కూడా పెట్టారు. అయితే ఇప్పుడు వరుణ్.. బేబీ షాపింగ్ తో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు లావణ్య త్రిపాఠి ఓ స్పెషల్ ఫోటోను ఇన్ స్టా స్టోరీలో షేర్ చేయగా.. ప్రస్తుతం అది ఫుల్ వైరల్ గా మారింది.

నా రియల్ బంగారం.. బేబీ కోసం ఏ బ్లాంకెట్ కొనాలో డిసైడ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఫోటో అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. డైలమాలో ఉన్నా కూడా స్టిల్ సూపర్ అని చెబుతున్నారు. అడ్వాన్స్ గా పేరెంట్స్ టు బి అయిన వరుణ్, లావణ్యలకు కంగ్రాట్స్ చెప్పేస్తున్నారు.

అయితే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. ప్రేమించుకుని ఇంట్లో ఒప్పించి 2023 నవంబర్‌ 1వ తేదీన ఇటలీలోని టస్కానీ వేదికగా వివాహం చేసుకున్నారు. వారి వెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన పిక్స్ ఇప్పటికే వైరల్ అయ్యారు. ఇప్పుడు మొదటి బిడ్డను స్వాగతించడానికి సిద్ధమవుతున్నారు.

కాగా వరుణ్, లావణ్య కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం మెగా హీరో VT15 షూటింగ్‌ తో బిజీగా ఉన్నారు. ఇండో కొరియన్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో హారర్ కామెడీ మూవీగా తెరకెక్కుతున్న ఆ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. రితికా నాయక్‌ హీరోయిన్‌ గా నటిస్తుండగా.. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు మెగా కోడలు రీసెంట్ గా సతీలీలావతిలో నటించారు. ఇప్పుడు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.