Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : దిష్టి తగిలేలా మెగా క్యూట్‌ కపుల్‌

టాలీవుడ్‌ మోస్ట్‌ బ్యూటీ ఫుల్‌ కపుల్స్‌లో మెగా హీరో వరుణ్‌ తేజ్‌ - లావణ్య త్రిపాఠి దంపతులు ఉంటారు అనడంలో సందేహం లేదు.

By:  Tupaki Desk   |   16 July 2025 10:43 AM IST
పిక్‌టాక్‌ : దిష్టి తగిలేలా మెగా క్యూట్‌ కపుల్‌
X

టాలీవుడ్‌ మోస్ట్‌ బ్యూటీ ఫుల్‌ కపుల్స్‌లో మెగా హీరో వరుణ్‌ తేజ్‌ - లావణ్య త్రిపాఠి దంపతులు ఉంటారు అనడంలో సందేహం లేదు. సుదీర్ఘ కాలం పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ 2023లో ఇటలీలోని టస్కానీలో వివాహం చేసుకున్నారు. మెగా ఫ్యామిలీ తో పాటు సన్నిహితలు, స్నేహితులు ఈ వివాహానికి హాజరు అయ్యారు. పెళ్లి తంతు వైభవంగా జరిగింది. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్‌ అయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరిద్దరు కలిసి ఉన్న ప్రతి ఫోటో నెట్టింట వైరల్‌ కావడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో వరుణ్‌-లావణ్య త్రిపాఠి కలిసి ఉన్న పోటో సోషల్‌ మీడియా ద్వారా రాకపోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.


ఎట్టకేలకు వరుణ్‌-లావణ్యల కొత్త ఫోటో సోషల్‌ మీడియా ద్వారా వచ్చింది. ఎప్పటిలాగే ఈ ఫోటోకు నెటిజన్స్‌ నుంచి మంచి స్పందన దక్కింది. మెగా ఫ్యాన్స్‌ ఈ ఫోటోను తెగ షేర్‌ చేసుకుంటూ లైక్‌ చేస్తున్నారు. మరికొందరు ఈ ఫోటోలో ఇద్దరు చాలా బాగున్నారు అంటూ కామెంట్‌ చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి ప్రస్తుతం గర్భంతో ఉన్న విషయం తెల్సిందే. మే నెలలో వీరు తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దాంతో అతి త్వరలోనే మెగా ఫ్యామిలీ ఇంట కొత్త మెంబర్‌ యాడ్‌ కాబోతున్నాడు. లావణ్య గర్భవతిగా ఉన్న ఈ సమయంలో మరింత అందంగా కనిపిస్తున్నారు అంటూ కొందరు నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలో వీరిద్దరినీ చూస్తే ఎవరి దిష్టి అయినా తగిలేలా ఉందని కొందరు కామెంట్‌ చేస్తున్నారు.

వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి కలిసి సినిమాల్లో నటించిన విషయం తెల్సిందే. సినిమా షూటింగ్‌ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది, ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. రెండు ఫ్యామిలీలను ఒప్పించి వీరు వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న లావణ్య త్రిపాఠితో వరుణ్‌ తేజ్‌ హాలీడే ట్రిప్‌ను ప్లాన్‌ చేశాడు. ఇద్దరూ చాలా సరదాగా లైఫ్‌ ను ఎంజాయ్‌ చేస్తూ, ప్రస్తుతం లావణ్యను ఎక్కువ ప్రశాంతంగా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నాడు. గర్భం దాల్చడంతో లావణ్య త్రిపాఠి ఇప్పటికే కమిట్‌ అయిన సినిమాలను పూర్తి చేసింది. కొత్తగా సినిమాలను కమిట్‌ కాలేదు. వచ్చే ఏడాదిలో లేదా, ఆ తర్వాత అయినా లావణ్య త్రిపాఠి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరో వైపు వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. వీటీ15 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ హర్రర్‌ కామెడీ మూవీ షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అయింది. యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. కొరియన్‌ హర్రర్‌ డ్రామాకు ఇది రీమేక్‌గా రూపొందుతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమాలో కమెడియన్‌ సత్య కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు ఆయన కామెడీ ప్రధాన ఆకర్షణగా నిలువబోతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. విడుదల తేదీ పై మరింత స్పష్టత రావాల్సి ఉంది.