మెగా గుడ్ న్యూస్ వచ్చేసింది!
మెగా ఫ్యామిలీలో శుభవార్త వినిపిస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
By: Tupaki Desk | 6 May 2025 7:19 AMమెగా ఫ్యామిలీలో శుభవార్త వినిపిస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఈ జంట వివాహం చేసుకుని ఏడాది గడిచిన తర్వాత, ఇప్పుడు తమ తొలి సంతానం కోసం ఎదురుచూస్తున్నారు. మెగా అభిమానులు ఈ వార్తతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. సోషల్ మీడియాలో #VarunLav ట్యాగ్‌తో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి 2023 నవంబర్ 1న ఇటలీలోని టస్కనీలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ సమక్షంలో జరిగిన ఈ వేడుకలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్స్ పాల్గొన్నారు. వీరి లవ్ స్టోరీ ‘మిస్టర్’ సినిమా సెట్స్‌లో మొదలై, ‘అంతరిక్షం’ సినిమాతో మరింత బలపడింది. ఈ జంట తమ ప్రేమ వివాహంతో అభిమానులను ఆనందింపజేసింది. ఇప్పుడు తల్లిదండ్రులుగా మారబోతున్న వార్త అభిమానులకు మరో పండగ.
వరుణ్ తేజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నాడు. “లైఫ్ లో కొత్త రోల్ కి సిద్ధం అంటూ.. కమింగ్ సూన్” అని లవ్ తో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌తో అభిమానులు ఫుల్ ఎగ్జైట్‌మెంట్‌లో మునిగిపోయారు. మెగా ఫ్యామిలీలో మరో కొత్త మెంబర్ రాబోతున్నట్లు చాలా రోజులుగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి.
ఇక అవన్నీ రూమర్స్ అనేలా కూడా కొన్ని కథనాలు వెలువడ్డాయి. కానీ ఎట్టకేలకు వరుణ్ తేజ్ అఫీషియల్ గా క్లారిటి ఇచ్చేశాడు. వరుణ్ లావణ్య ఈ జంట ఎప్పుడూ తమ ప్రేమతో, సింప్లిసిటీతో అభిమానులను ఆకర్షిస్తూ వస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ ఇటీవల ఆపరేషన్ వాలెంటైన్, మట్కా లాంటి డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నాడు.
లావణ్య కూడా పెళ్లి అనంతరం ఎప్పటిలానే నటిగా కొనసాగే ప్రయత్నం చేసింది. ఇప్పుడు పర్సనల్ లైఫ్ లో ఈ ఇద్దరు మరింత బిజీ అవుతారని చెప్పవచ్చు. మొత్తంగా, వరుణ్-లావణ్య జంట తల్లిదండ్రులుగా మారడం మెగా ఫ్యామిలీ అభిమానులకు పండగలా ఉంది. వరుణ్ తేజ్ తన తదుపరి సినిమాను మెర్లపాక గాంధీ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.