Begin typing your search above and press return to search.

వంగా 'యానిమల్'.. అనురాగ్ Vs వరుణ్ వార్ వెనుక రీజన్ ఇదే!

అప్పట్లో ఇద్దరు సెలబ్రిటీలు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, రైటర్ వరుణ్ గ్రోవర్ మధ్య జరిగిన సోషల్ మీడియా వార్ పై ఒక్కసారిగా అందరి దృష్టి పడింది. ఇప్పుడు ఆ వార్ పై వరుణ్ గ్రోవర్ క్లారిటీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   11 Jun 2025 11:39 AM IST
వంగా యానిమల్..  అనురాగ్ Vs వరుణ్ వార్ వెనుక రీజన్ ఇదే!
X

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ యానిమల్ మూవీతో ఎలాంటి హిట్ అందుకున్నారో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టిన యానిమల్.. ఓటీటీలో కూడా దూసుకుపోయింది.

అయితే మూవీ ఎంత హిట్ అయిందో.. అంతే హాట్ టాపిక్ గా కూడా మారింది. సోషల్ మీడియాలో చర్చలు సాగాయి. కొందరు సినిమాను ప్రశంసించగా.. మరికొందరు విమర్శించారు. అప్పట్లో ఇద్దరు సెలబ్రిటీలు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, రైటర్ వరుణ్ గ్రోవర్ మధ్య జరిగిన సోషల్ మీడియా వార్ పై ఒక్కసారిగా అందరి దృష్టి పడింది. ఇప్పుడు ఆ వార్ పై వరుణ్ గ్రోవర్ క్లారిటీ ఇచ్చారు.

అసలేమైందంటే?

యానిమల్ మూవీ రిలీజ్ అయ్యాక డైరెక్టర్ సందీప్ వంగాతో దిగిన పిక్ ను అనురాగ్ కశ్యప్ పోస్ట్ చేశారు. చాలా నిజాయతీపరుడు అంటూ పొగిడారు. దీంతో అనేక మంది ఆయన పోస్ట్ పై స్పందించారు. అప్పుడు వరుణ్ గ్రోవర్ మాత్రం NO అని కామెంట్ చేశారు. అప్పట్లో ఆ చిన్న వర్డ్ ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.

ఇప్పుడు ఆ విషయంపై వరుణ్ గ్రోవర్ స్పందించారు. తన కామెంట్ వెనుక ఉన్న కారణాన్ని వెల్లడించారు. ఒక సినిమాను సమర్థించడం వేరు, ఆ దర్శకుడి వ్యక్తిత్వాన్ని సమర్థించడం వేరని అన్నారు. అనురాగ్ పెట్టిన పోస్ట్.. యానిమల్ మూవీ గురించి కాదు, పూర్తిగా డైరెక్టర్ వ్యక్తిత్వాన్ని కాపాడే ప్రయత్నంలా అనిపించిందని చెప్పారు.

అందుకే తాను నో అని కామెంట్ పెట్టినట్లు తెలిపారు వరుణ్. దిగ్గజ రచయిత జావేద్ అక్తర్‌ కు రాయడం రాదని, ఫీల్ లేదని సందీప్ వంగా విమర్శించారని తెలిపారు. సోషల్ మీడియాలో తగాదాల్లో పాల్గొనే నిర్మాత సందీప్ అంటూ వ్యాఖ్యానించారు. అలా చేయడం.. వ్యక్తిగత దాడులకు దిగడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు.

అందుకే అనురాగ్ కేవలం సినిమా గురించి పోస్ట్ పెడితే, తాను జోక్యం చేసుకోనని అన్నారు. దర్శకుడి వ్యక్తిగత ప్రవర్తనను సమర్థిస్తున్నారని అనిపించి కామెంట్ పెట్టానని తెలిపారు. ఆ తర్వాత అనురాగ్ తో తన స్నేహంలో ఎలాంటి ఇబ్బంది రాలేదని చెప్పారు. అనురాగ్ కశ్యప్ చాలా మంచి మనసుతో స్పందించారని అన్నారు. ప్రస్తుతం ఆయన వివరణ సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ గా మారింది.