Begin typing your search above and press return to search.

లవర్స్ డే రోజు.. ఈ ట్విస్టెంటి పాప

మిడిల్ క్లాస్ మెలోడిస్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది ముద్దుగుమ్మ వర్ష బొల్లమ్మ.

By:  Tupaki Desk   |   14 Feb 2024 7:54 AM GMT
లవర్స్ డే రోజు.. ఈ ట్విస్టెంటి పాప
X

మిడిల్ క్లాస్ మెలోడిస్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది ముద్దుగుమ్మ వర్ష బొల్లమ్మ. తన క్యూట్ క్యూట్ ఎక్సప్రెషన్స్ తో ప్రేక్ష‌కుల చూపును త‌న‌వైపు తిప్పుకుందీ బ్యూటీ. మన దగ్గర అమ్మాయిలా క‌నిపించే రూపంతో ఆక‌ట్టుకుంటూ కుర్ర‌కారును ఫిదా చేస్తోంది. ఈ మధ్య గ్లామర్ మీద కూడా ఫోకస్ పెడుతూ అప్పుడప్పుడు ఫొటోస్ తో ఆకట్టుకుంటుంది.


జాను, పుష్పక విమానం, స్వాతిముత్యం, స్టాండప్ రాహుల్ తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది వర్ష. ఇటీవల ఆమె ఊరు పేరు భైరవకోన చిత్రంలో హీరోయిన్ గా నటించింది. యంగ్ సందీప్ కిషన్ నటించిన ఈ మూవీని వీఐ ఆనంద్ దర్శకత్వం వహించగా, రాజేష్ దండా నిర్మించారు. మరో రెండు రోజుల్లో ఈ బ్యూటీ.. థియేటర్ లో సందడి చేయనుంది.

ఇది పక్కన పెడితే.. తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. వాలెంటైన్స్ డే రోజు ఆమె పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. బ్లాక్ కలర్ సింపుల్ డ్రెస్ లో మనస్ఫూర్తిగా నవ్వుతున్న పిక్ ను షేర్ చేసింది. సంతోషంగా ఉండడం ఎలా అంటే.. మీరు వేసిన జోకులకు మీరే నవ్వుకోండి అంటూ రాసుకొచ్చింది. అయితే హ్యాపీ వాలైంటెన్స్ డే అని కాకుండా వెరైటీగా ఫ్రెండ్ షిప్ డే తో పాటు రక్షాబంధన్ విషెస్ చెప్పింది. దీంతో నెటిజన్లు.. వర్ష ఓ క్రేజీ అమ్మాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

తమిళనాడుకు చెందిన వర్ష బొల్లమ్మ.. మైక్రోబయాలజీ చదివింది. అయితే చిన్నప్పటి నుంచే యాక్టింగ్ పై మంచి ఇంట్రెస్ట్ ఉండడంతో డబ్ స్మాష్ వీడియోలు చేసింది. వాటితో మంచి ఫేమస్ అయింది. ఆ తర్వాత కోలీవుడ్ లో శాతురన్ సినిమాలో నటిగా ఎంట్రీ ఇచ్చింది. 96, బిగిల్ మూవీల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇక చూసీ చూడంగానే మూవీతో టాలీవుడ్ కు పరిచయమైంది.

మరోవైపు, బెల్లంకొండ గణేష్‌ తో వర్ష ప్రేమలో ఉందని, త్వరలో వీరు పెళ్లి చేసుకుంటారని కొన్నినెలలుగా అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. ఇటీవలే వాటిపై స్పందించింది. 'నిప్పు లేకుండా పొగ వస్తుందని అంటారు కదా! అలా అనిపించింది. గణేష్ మంచి కోస్టార్. మేం బయట హ్యాంగవుట్ అయ్యింది లేదు.. పెళ్లి పుకారు ఎలా వచ్చిందో తెలియలేదు'' అని చెప్పింది. మరి భైరవకోన సినిమాతో వర్ష ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.