Begin typing your search above and press return to search.

మూడు కొడిగుడ్లు గుట్టుక్కున మింగేసిన బ్యూటీ!

ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే అమ్మ‌డు మంచి నాన్ వెజ్ ప్రియురాలు అట‌. అందులోనూ కోడిగుడ్డు లేక‌పోతే ముద్ద దిగ‌ద‌నేసింది.

By:  Tupaki Desk   |   4 July 2025 4:24 PM IST
మూడు కొడిగుడ్లు గుట్టుక్కున మింగేసిన బ్యూటీ!
X

కూర్గ్ బ్యూటీ వ‌ర్ష బొల‌మ్మ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. కోలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన అమ్మడి ప్పుడు అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చేస్తోంది. సౌత్ లో అన్ని భాష‌ల్ని ట‌చ్ చేసింది. తెలుగులో చూసి చూడంగానే చిత్రంతో లాంచ్ అయింది. అంటుపై 'జాను','మిడిల్ క్లాస్ మెలోడీస్' లాంటి చిత్రాల్లో న‌టిం చింది. ఇలా మీడియం బ‌డ్జెట్ సినిమాలు చేసింది. మంచి పెర్పార్మ‌ర్. కానీ అమ్మ‌డికి స‌రైన ఛాన్సులు మాత్రం రావ‌డం లేదు. తాజాగా రిలీజ్ అయిన నితిన్ 'త‌మ్ముడు'లో న‌టించింది.

వ‌ర్ష కెరీర్ లో ఇదే పెద్ద సినిమా.ఈ సినిమాపై అమ్మ‌డు చాలా ఆశ‌లు పెట్టుకుంది. స‌క్సెస్ అందుకుని కెరీర్ లో ముంద‌డుగు వేయాల‌ని చాలా ఆశ‌తో ఎదురు చూస్తుంది. మ‌రి ఆ సినిమా ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో చూడాలి. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే అమ్మ‌డు మంచి నాన్ వెజ్ ప్రియురాలు అట‌. అందులోనూ కోడిగుడ్డు లేక‌పోతే ముద్ద దిగ‌ద‌నేసింది. ఈ అల‌వాటు చిన్న‌ప్ప‌టి నుంచి ఉంద‌ని తెలిపింది. రెండేళ్ల వ‌య‌సులోనే మూడు కోడిగుట్లు తిన్న‌ట్లు గుర్తు చేసుకుంది.

సాధార‌ణంగా ఆ య‌వ‌సులో ఎవ‌రూ ఒక్క గుడ్డు కూడా పూర్తిగా తిన‌లేరు. కానీ తాను మాత్రం ఒకే ప్లేట్ లో పెట్టిన మూడు గుడ్ల‌ను తినేసిందట‌. మామ్ గిన్నిలో గుడ్లు ఏవ‌ని అడిగితే తినేసాను అని స‌మాధానం చెప్పేసరికి షాక్ అయ్యారుట‌. దీంతో నీర‌స‌పడిపోయిందట‌. అప్ప‌టిక‌ప్పుడు డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌క తీసుకెళ్లి వైద్యం చేయించారుట అప్ప‌టి నుంచి త్రీ ఎగ్ వ‌ర్ష అనే పేరు ప‌డిపోయిందంది. తానెప్పుడు తినాల‌న్నా మూడు గుడ్లు త‌ప్ప‌న‌స‌రి అట‌.

అయితే బుగ్గ‌లు పొంగిన‌ట్లు అనిపించడంతో కొంత కాలంగా కోడిగుడ్ల‌కు దూరంగా ఉన్న‌ట్లు తెలిపింది. అలాగే స్వీట్ విష‌యంలో ర‌స‌మ‌లై, ర‌సగుల్ల అంటే అమితంగా ఆస్వాది స్తుందిట‌. త‌న‌లో ఎవ‌రూ ర‌స‌మ‌లై తిన‌లేర‌ని చెబుతుంది. ప్ర‌స్తుతం మాత్రం స్వీట్లు, గుడ్లుకు దూరంగా ఉన్న‌ట్లు తెలిపింది.