బల్ల గుద్ది మరీ ఎగ్ దోశను ఎత్తేసింది!
కన్నడ బ్యూటీ వర్ష బొలమ్మ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. సక్సెస్ లతో పనిలేకుండా అమ్మడికి క్రేజ్ ఉంది.
By: Tupaki Desk | 5 July 2025 8:00 PM ISTకన్నడ బ్యూటీ వర్ష బొలమ్మ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. సక్సెస్ లతో పనిలేకుండా అమ్మడికి క్రేజ్ ఉంది. కోలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన అమ్మడిప్పుడు అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. దక్షిణాదిన అన్ని భాషల్ని టచ్ చేసింది. `చూసి చూడంగానే` చిత్రంతో లాంచ్ అయిన బ్యూటీ `జాను` ,` మిడిల్ క్లాస్ మెలోడీస్` లాంటి చిత్రాలతో మరింత దగ్గరైంది. మీడియం బడ్జెట్ చిత్రాలతో నిర్మాతలకు అందుబాటులో ఉన్న నాయిక. తాజాగా రిలీజ్ అయిన తమ్ముడు లో కూడా నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. కానీ వాటిని అందుకోవడంలో `తమ్ముడు` వేగం చూపించలే కపో తున్నాడు. ఆ సంగతి పక్కన బెడితే వర్ష మంచి పుడీ కూడా. రెండేళ్ల వయసులోనే మూడు గుడ్లు లాగిం చేసింది. ఎగ్ ప్యావరెట్. తాజాగా వర్ష ఎగ్ దోశను ఏ రేంజ్ లో ఆస్వాదించిందో తెలిస్తే చెప్ప్ స్పెషలిస్ట్ కూడా వర్ష రేంజ్ లో ఎలివేషన్ ఇవ్వలేడేమో అనిపిస్తుంది. తమ్మడు షూటింగ్ లో భాగంగా రంపచోడవరం రోడ్డు పక్కనే ఉన్న చిన్న హోటల్ లో యగ్ దశోను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనంటోంది.
ఎగ్ దోశెను వేసిన విధానం...కాల్చిన విధానాన్ని వర్ష భలే వివరించింది. ఆ రుచి గురించి చెబుతూ జీవితంలో ఇంతవరకూ అంత టేస్టీ ఎగ్ దోశ తినలేదంది. ఈ విషయాన్ని బల్ల గుద్ది మరీ చెప్పింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఎగ్ దోశె గురించి వర్ష చెబుతున్నప్పుడు ముఖంలో ఆ ఎక్స్ ప్రెషన్ చూస్తే ఆ దోశ టేస్ట్ ను అమ్మడు ఏ రేంజ్ లో ఆస్వాదించిందో అర్దమవుతుంది.
ఏది ఏమైనా మరోసారి తాను ఎగ్ ప్రియురాలని నిరూపించింది. ఆ ఎగ్ దోశ చేసింది ఓ కూడా ఓ ఆంటీ అని తెలిపింది. ఆవిడెవరో తెలిస్తే కుమారీ అంటీ వైరల్ అయినట్లు అవ్వడం ఖాయం. ఈ మధ్య కాలంలో పుడ్ వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే.