Begin typing your search above and press return to search.

రాయణం కి సోప్ ఏస్తున్న వర్మ, పెద్ద ప్లాన్‌ ఏమైనా..?

ఉప్పెన సినిమాలో రాయణం పాత్రలో నటించి మెప్పించిన విజయ్‌ సేతుపతి ఆ తర్వాత పలు టాలీవుడ్‌ సినిమాల్లో నటించాడు.

By:  Tupaki Desk   |   22 May 2024 8:30 AM GMT
రాయణం కి సోప్ ఏస్తున్న వర్మ, పెద్ద ప్లాన్‌ ఏమైనా..?
X

ఉప్పెన సినిమాలో రాయణం పాత్రలో నటించి మెప్పించిన విజయ్‌ సేతుపతి ఆ తర్వాత పలు టాలీవుడ్‌ సినిమాల్లో నటించాడు. కేవలం సౌత్‌ లోనే కాకుండా బాలీవుడ్‌ సినిమాలపై కూడా ఈయన దృష్టి పెట్టాడు. పాన్ ఇండియా స్టార్‌ నటుడిగా పేరు దక్కించుకున్న విజయ్‌ సేతుపతిని తాజాగా రామ్ గోపాల్‌ వర్మ కలిశాడు.

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఒకప్పుడు సినిమాల వల్ల వార్తల్లో ఉండేవాడు. కానీ ఇప్పుడు కేవలం వివాదాల కారణంగానే వార్తల్లో ఉంటున్నాడు. ఆయన సినిమాలు చేసేది తక్కువ, వివాదాలు ఎక్కువ అన్నట్లుగా పరిస్థితి మారింది. అలాంటి వర్మ ఇప్పుడు విజయ్‌ సేతుపతిని కలవడం వెనుక ఉద్దేశ్యం ఏంటి అంటూ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ట్విట్టర్ లో రామ్‌ గోపాల్‌ వర్మ... చాలా సార్లు స్కీన్‌ మీద ఇతడిని చూశాను, ఎట్టకేలకు డైరెక్ట్‌ గా కలిశాను. అయితే స్క్రీన్ పై కంటే కూడా రియాల్టీ లో మరింత బెటర్ అనిపించాడు అంటూ ఈ ఫోటోను షేర్‌ చేసి ట్వీట్‌ చేశాడు. వర్మ ట్వీట్ కు చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

విజయ్‌ సేతుపతికి వర్మ సోప్ ఏస్తున్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తే, ఇద్దరూ కూడా మంచి ప్రతిభావంతులు. కనుక ఒకరికి ఒకరు తోడు అయితే అద్భుతం ఆవిష్కారం అవుతుంది. అందుకే వీరిద్దరి కాంబోలో సినిమా రావాలని కోరుకుంటున్నామని కొందరు కామెంట్స్ చేశారు.

ఇంతకు రామ్‌ గోపాల్‌ వర్మ తాను ఎందుకు విజయ్‌ సేతుపతిని కలిశాను అనే విషయాన్ని చెప్పలేదు. ప్రస్తుతం విజయ్ సేతుపతి చేతిలో పది సినిమాలకు పైగా ఉన్నాయని టాక్. వివిధ దశల్లో ఉన్న ఆ సినిమాలను ముగించేందుకు కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.

కనుక ఇద్దరి కాంబో మూవీ ఇప్పట్లో ఉండే అవకాశం లేదు, మరి ఎందుకు వర్మ ప్రత్యేకంగా విజయ్‌ సేతుపతిని కలిసి ఉంటాడు అనేది చర్చ. ఇండియన్ సినీ సెలబ్రిటీల్లో ఎంతో మందికి వర్మ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ఈ మధ్య ఆయన తీరు సరిగా లేదని విమర్శిస్తున్నారు కానీ చాలా మంది ఆయనను అభిమానిస్తాను.

ఆ అభిమానుల జాబితాలో విజయ్ సేతుపతి కూడా ఉన్నాడేమో మరి.. అందుకే ఆయనే స్వయంగా వర్మను కలిశాడేమో అనేది మరి కొందరి మాట. అసలు విషయం ఏంటి అనేది వారిద్దరిలో ఎవరో ఒకరు నోరు తెరవాల్సిన అవసరం ఉంది.