Begin typing your search above and press return to search.

ఆమె బర్రెలక్క.. పవన్ బర్రెలెక్క..!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ గా వ్యూహం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

By:  Tupaki Desk   |   24 Dec 2023 12:25 PM GMT
ఆమె బర్రెలక్క.. పవన్ బర్రెలెక్క..!
X

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ గా వ్యూహం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 2009-14 మధ్యలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా ఈ నెల 29న రిలీజ్ అవుతుండగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జగ గర్జన విజయవాడలో జరిగింది. ఈవెంట్ లో పాల్గొన్న ఆర్జీవి తన సినిమా గురించి అందులోని పాత్రల గురించి చెప్పారు. ముఖ్యంగా పవన్ ని బర్రె లెక్క మారిపోయాడంటూ కామెంట్ చేశారు ఆర్జీవి.

ఈవెంట్ లో భాగంగా పవన్ గురించి ప్రస్తావించిన వర్మ రంగుల రాజా పవన్ కళ్యాణ్ ఆయన ముఖానికి రంగేసుకుని ఒక సూపర్ స్టార్ అయ్యాడు. దాన్ని ఎవరు కాదనలేరు. ఆయనకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక రాజకీయ నాయకుడిగా ఆయన వచ్చినప్పుడు ఇది చేస్తా అది చేస్తా అని సినిమాలో డైలాగ్స్ చెప్పినట్టు చెప్పాడు. జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను కూడా ఇంప్రెస్ అయ్యాను. లేటెస్ట్ గా ఊరు పేరు తెలియని ఒక అమ్మాయి బర్రెలక్క తెలంగాణాలో ఒంటరిగా పోటీ చేసింది. బర్రెలను కాసే ఆ అమ్మాయి అంత పాపులర్ అయినప్పుడు ఈయన సూపర్ స్టార్ అయ్యుండి కూడా బర్రె లెక్క అయిపోయాడు.

బర్రెలక్కకి బర్రెలెక్కకి తేడా ఏంటంటే బర్రెలకు కాపలాగా బర్రె లక్క అయితే.. ఈయన బర్రెలాగా చంద్రబాబు నాయుడు లోకేష్ ఏం చెబితే అది చేస్తున్నాడు. అంటే బర్రెలు గొర్రెలను ఇటు వెళ్లు అటు వెళ్లు అంటే వెళ్తాయి కదా అవి ఏం చేస్తాయో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే చేస్తున్నాడు. నేను జనసేన మనిషి కాదు జనసేన కన్నా నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కానీ ఇప్పుడు అది మొత్తం పోయిందని అన్నారు ఆర్జీవి.

ఏపీ రాజకీయ పరిస్థితుల నేపథ్యంతోనే తెరకెక్కిన వ్యూహం సినిమా తను ఎవరిని టార్గెట్ చేసి తీయలేదని అన్నారు ఆర్జీవి. సినిమా ఈవెంట్ లో చంద్రబాబు, పవన్, లోకేష్ లను టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని బర్రె లెక్క మారాడని చెప్పడం పవర్ స్టార్ ఫ్యాన్స్ ని డిస్టర్బ్ చేస్తుంది.