Begin typing your search above and press return to search.

మాట మీద నిలబడ్డ వర్మ.. 'శారీ' అందం రాబోతుంది

కొన్ని నెలల క్రితం రామ్ గోపాల్ వర్మ చీర కట్టుకుని చాలా అందంగా ఫోటోలకు ఫోజ్ ఇస్తూ ఉన్న ఒక అమ్మాయి వీడియోను షేర్‌ చేశాడు.

By:  Tupaki Desk   |   21 Dec 2023 10:08 AM GMT
మాట మీద నిలబడ్డ వర్మ.. శారీ అందం రాబోతుంది
X

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఈ మధ్య కాలంలో ఎన్నో సినిమాలను ప్రకటించాడు. అందులో కొన్ని తాను చేస్తే, కొన్ని సినిమాలను ఇతర దర్శక నిర్మాతలకు అప్పగించి పూర్తి చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు శారీ అనే సినిమాను వర్మ ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించాడు.


కొన్ని నెలల క్రితం రామ్ గోపాల్ వర్మ చీర కట్టుకుని చాలా అందంగా ఫోటోలకు ఫోజ్ ఇస్తూ ఉన్న ఒక అమ్మాయి వీడియోను షేర్‌ చేశాడు. ఈమె ఎవరో నాకు తెలియజేయండి అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్‌ పెట్టాడు. ఆ పోస్ట్‌ కు విపరీతమైన స్పందన వచ్చింది. ఆ చీర కట్టుకున్న యువతి మలయాళ ఇండస్ట్రీకి చెందిన శ్రీలక్ష్మి సతీష్ అని తేలింది.

ఆమె తో వర్మ గతంలోనే సినిమాను తీస్తానంటూ ప్రకటించాడు. అయితే వర్మ అలా ఎన్నో సినిమాలు ప్రకటిస్తాడు.. కానీ అందులో ఎంత వరకు సినిమా లు పూర్తి చేస్తాడో క్లారిటీ లేదు. కనుక ప్రస్తుతం పొలిటికల్‌ డ్రామా వ్యూహం పై దృష్టి పెట్టిన వర్మ శారీ ని మరచి పోయాడేమో అనుకున్నారు. కానీ తాజాగా శారీని మొదలు పెడతాను అంటూ ప్రకటించాడు.

గతంలో శ్రీలక్ష్మి సతీష్ కు ఇచ్చిన మాట ప్రకారం శారీ అనే టైటిల్ తో సినిమాను రూపొందించబోతున్నట్లుగా ఒక పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ఆ పోస్టర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చీర కట్టు లో హీరోయిన్స్‌ ను అభిమానించే వారు అంతా కూడా వర్మ రూపొందించబోతున్న శారీ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఒక వైపు వ్యూహం ను రెండు పార్ట్‌ లుగా చేస్తానంటూ ప్రకటించి మొదటి పార్ట్‌ ని రిలీజ్ కి సిద్ధం చేసిన వర్మ ఇప్పుడు శారీ ని తానే స్వయంగా రూపొందిస్తాడా లేదంటే ఎవరి చేతిలో అయినా పెడుతాడా అనేది చూడాలి.