Begin typing your search above and press return to search.

సినిమాలు.. యుద్ధ విమానాలు.. ఈ అమ్మాయి స్టైలే వేరు!

సాధార‌ణ ఉద్యోగ జీవితంతోనే చాలామంది త‌మ జీవిక‌థ‌ల్ని ముగిస్తున్నారు. అలాంటి వారికి భిన్నంగా మూడు రంగాల్లో ప్ర‌తిభ‌, చొర‌వతో ఆశ్చ‌ర్య‌ప‌రిచిన మేటి ప్ర‌తిభావ‌ని ప‌న్వ‌ర్ అనే యువ‌తి గురించి తెలుసుకుని తీరాలి.

By:  Tupaki Desk   |   26 May 2025 9:41 AM IST
సినిమాలు.. యుద్ధ విమానాలు.. ఈ అమ్మాయి స్టైలే వేరు!
X

సాధార‌ణ ఉద్యోగ జీవితంతోనే చాలామంది త‌మ జీవిక‌థ‌ల్ని ముగిస్తున్నారు. అలాంటి వారికి భిన్నంగా మూడు రంగాల్లో ప్ర‌తిభ‌, చొర‌వతో ఆశ్చ‌ర్య‌ప‌రిచిన మేటి ప్ర‌తిభావ‌ని ప‌న్వ‌ర్ అనే యువ‌తి గురించి తెలుసుకుని తీరాలి. ఓ వైపు ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ ద‌ళంలో ప‌ని చేస్తూనే, మ‌రోవైపు సినీరంగంతో అనుబంధం కొన‌సాగించిన వ‌ర్లిన్ ప‌న్వ‌ర్ యూత్ హృద‌యాల‌ను గెలుచుకున్న ఐపిఎల్ కోసం తెర‌వెన‌క ప‌ని చేసిన అనుభ‌వ‌జ్ఞురాలు.

రిటైర్డ్ స్క్వాడ్రన్ లీడర్ వర్లిన్ పన్వర్ దశాబ్ధం పాటు భారత వైమానిక దళంలో సైనిక సేవలు చేసారు. ఈ ప్ర‌తిభావ‌ని వైమానిక ద‌ళ యూనిఫాం ధ‌రించి, దేశానికి సేవ‌లందించడంలో అంకితభావాన్ని ప్రద‌ర్శించింది. దీంతో పాటు, విభిన్న రంగాలలోను త‌న ఉనికిని చాటుకుంది. ఇటీవల హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఇన్‌స్టాలో షేర్ చేసిన పోస్ట్ లో ప‌న్వ‌ర్ క‌థ అంద‌రినీ ఆక‌ర్షించింది.


త‌న ప‌ద‌వీ కాలం ప‌దేళ్లు పూర్త‌యాక‌..కూడా భారత వైమానిక దళంలో భారతదేశం తన సాయుధ దళాలను ఎలా రూపొందించాలో నేర్పడంలో ప‌న్వ‌ర్ స‌హ‌క‌రిస్తున్నారు. ఇది కేవ‌లం తెర వెలుప‌ల మాత్ర‌మే కాదు, తెరపైనా ఈ త‌ర‌హా స‌హ‌కారం అందిస్తున్నారు. సినీరంగంలో విమానాల నేప‌థ్యంలో రూపొందించిన ప‌లు చిత్రాల‌కు ప‌న్వ‌ర్ ప‌ని చేసారు.


ఇక తండ్రి నుంచి బాల్యంలోనే ప్రేర‌ణ పొందిన ప‌న్వ‌ర్ ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో వైమానిక ద‌ళంలో అవ‌కాశం అందుకున్నారు. 12 సంవత్సరాల వయసులో, డెహ్రాడూన్‌లో పాసింగ్ అవుట్ పరేడ్‌ను చూసినప్పుడు ప‌న్వ‌ర్ ఆశయం దృఢంగా మారింది. క్యాడెట్ల ముఖాల్లోని గర్వం చూశాక తాను కూడా భార‌త‌దేశ సైన్యంలో చేరి సేవ చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. గ్రాడ్యుయేషన్ సమయంలో 11వ బాలికల బెటాలియన్‌లో భాగంగా ఎన్‌సిసిలో చేరింది. వర్షంలో కవాతు చేయడం, శిబిరాలకు హాజరు కావడం, స్ట‌డీస్ ని సమతుల్యం చేయడం.. చాలా క‌ఠిన‌మైన శిక్ష‌ణ‌ను తీసుకుంది. చివరికి జాతీయ స్థాయిలో ఉత్తమ క్యాడెట్ బిరుదును సంపాదించింది.


చివ‌రికి భార‌త‌దేశానికి సేవ చేసేందుకు ఆర్మీతో పాటు, వైమానిక ద‌ళం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణ‌త సాధించాక వైమానిక ద‌ళాన్ని ఎంపిక చేసుకున్నారు. దీని వెన‌క త‌న తండ్రి ప్రోత్సాహం ప్రోద్భ‌లం ఉంద‌ని ప‌న్వ‌ర్ చెప్పారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే అక్ష‌య్ కుమార్ స‌హా ప‌లువురు బాలీవుడ్ హీరోలు న‌టించిన వైమానిక ద‌ళ చిత్రాల‌కు తెర‌వెన‌క ప‌ని చేసారు ప‌న్వ‌ర్. మ‌రోవైపు ఐపీఎల్ నిర్వాహ‌కుల‌తో క‌లిసి ప‌న్వ‌ర్ సెక్యూరిటీ విభాగం స‌హా ప‌లు అంశాల‌లో స‌హ‌క‌రిస్తుంటారు. ఇలాంటి బ‌హుముఖ ప్ర‌జ్ఞ చాలా అరుదుగా కొంద‌రు వ్య‌క్తుల‌కే సాధ్యం.