Begin typing your search above and press return to search.

రెండు ద‌శాబ్దాల త‌ర్వాత ఆ క్రేజీ కాంబో!

మ‌హేష్ హీరోగా రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న పాన్ ఇండియా చిత్ర‌మిది. మ‌రి రాజ‌మౌళితో ప్ర‌కాష్ రాజ్ కాంబినేష‌న్ ఎన్నిసార్లు అంటే ఒకే ఒక్క‌సారి గా తెలుస్తోంది.

By:  Srikanth Kontham   |   19 Feb 2026 11:45 AM IST
రెండు ద‌శాబ్దాల త‌ర్వాత ఆ క్రేజీ కాంబో!
X

విలక్ష‌ణ న‌టుడు ప్ర‌శాష్ రాజ్ తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని క‌లిగిన న‌టుడు. ప‌ర‌భాషా న‌టుడైనా? తెలుగు ఆడియ‌న్స్ ప్ర‌కాష్ రాజ్ ను సొంతింటి మ‌నిషిలా భావిస్తారు. ఆయ‌న పాత్ర‌ల‌తోనే అంత‌టి గుర్తింపు ద‌క్కింద‌న్న‌ది కాద‌న‌లేని నిజం. ఎన్నో తెలుగు సినిమాల్లో న‌టించి త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నారు. ఎంతో మంది హీరోల చిత్రాల్లో భాగ‌మ‌య్యారు. నాన్న‌గా..ప్ర‌తి నాయ‌కుడిగా ..సోద‌రుడిగా ఇలా ఆయ‌న పోషించ‌ని పాత్ర అంటూ లేదు. ప్ర‌త్యేకించి సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో క‌లిసి ఎన్నో సినిమాల్లో న‌టించారు.

అలా వ్య‌క్తిగ‌తంగా మ‌హేష్ కూడా ప్రకాష్ రాజ్ కు ఎంతో క్లోజ్ అయ్యారు. దాదాపు 12 సినిమాల్లో క‌లిసి న‌టించారు. `ఒ క్క‌డు` చిత్రం నుంచి `గుంటూరు కారం` వ‌ర‌కూ ఈ లైన‌ప్ ఉంది. `అర్జున్`, `అత‌డు`, `పోకిరి``, `ఖ‌లేజా`, `దూకుడు`, `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు`, `ఆగ‌డు`, `భ‌ర‌త్ అనే నేను`, `మ‌హ‌ర్షి`, `స‌రిలేరు నీకెవ్వ‌రు` లో ఇరువురు క‌లిసి ప‌ని చేసారు. ఆ కాంబినేష‌న్ లో స‌న్నివేశాలు అంటే అంతే ప్ర‌త్యేకంగానూ నిలిచాయి. ఇలా మ‌హేష్‌- ప్ర‌కాష్ రాజ్ ల‌కు ఓ ట్రాక్ రికార్డు ఉంది. తాజాగా మ‌ళ్లీ ఇరువురు `వార‌ణాసి`లో భాగ‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే.

మ‌హేష్ హీరోగా రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న పాన్ ఇండియా చిత్ర‌మిది. మ‌రి రాజ‌మౌళితో ప్ర‌కాష్ రాజ్ కాంబినేష‌న్ ఎన్నిసార్లు అంటే ఒకే ఒక్క‌సారి గా తెలుస్తోంది. 20 ఏళ్ల క్రితం రాజ‌మౌళి డైరెక్ట్ చేసిన `విక్ర‌మ మార్కుడు` లో మాత్ర‌మే ప్ర‌కాష్ రాజ్ న‌టించారు. ఆ సినిమాలో ప్ర‌కాష్ రాజ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తారు. తెర‌పై క‌నిపించేది కొన్ని నిమిషాలే అయినా అద్యంతం ఆక‌ట్టుకునే రోల్ అది. ఆ త‌ర్వాత రాజ‌మౌళి చాలా సినిమాలు డైరెక్ట్ చేసారు. ఎంతో మంది న‌టీన‌టుల్ని త‌న సినిమాలో భాగం చేసారు. కానీ ప్ర‌కాష్ రాజ్ ను మాత్రం ఏ సినిమాకు తీసుకోలేదు.

మ‌ళ్లీ 20 ఏళ్ల‌కు `వార‌ణాసి` కి ఎంపిక చేయ‌డంతో? ప్ర‌కాష్ రాజ్ పాత్ర‌పై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. ఇందులో ప్ర‌కాష్ రాజ్ పరమ శివ భక్తుడి పాత్రలో కనిపిస్తార‌ని తెలుస్తోంది. అంటే మ‌హేష్ పోషిస్తోన్న రుద్ర పాత్ర‌కు తండ్రి రోల్ గా తెలుస్తోంది. సినిమాలో అడ్వెంచర్ మొదలవ్వడానికి ప్రకాష్ రాజ్ పాత్రే ప్రధాన కారణమని స‌మాచారం. అలాగే `మ‌హ‌ర్షి` సినిమాలో కూడా ఇరువురు తండ్రీకొడుకులుగా నే తెర‌పై క‌నిపించారు. ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌న్ని వేశాలు ఎమోష‌నల్ గా ఎంత‌గానో క‌నెక్ట్ అవుతాయి. `వార‌ణాసి`లో ఎమోష‌న్ మాత్రం వీటికి భిన్నంగా ఉంటుంది.ఎంతో మంది న‌టులున్నా? వాళ్లంద‌ర్నీ కాద‌ని రాజ‌మౌళి విల‌క్ష‌ణ న‌టుడ్ని తీసుకున్నారంటే? ఆయ‌న ప్ర‌త్యేక‌త లేకుండా ఉండ‌దు.