Begin typing your search above and press return to search.

పెద్ద ఛాన‌ల్ ఓన‌ర్ రూమ్ బుక్ చేస్తాన‌న్నాడు: వ‌ర‌ల‌క్ష్మి శ‌రత్‌కుమార్

ఒక పెద్ద‌ మీడియా చానెల్ అధినేత‌ త‌న‌తో త‌ప్పుగా వ్య‌వ‌హ‌రించార‌ని అప్ప‌ట్లో వ‌ర‌ల‌క్ష్మి ఆరోపించారు. అంతేకాదు.. అత‌డిపై పోలీస్ కేసు కూడా ఫైల్ చేసారు

By:  Tupaki Desk   |   1 May 2024 7:29 AM GMT
పెద్ద ఛాన‌ల్ ఓన‌ర్ రూమ్ బుక్ చేస్తాన‌న్నాడు: వ‌ర‌ల‌క్ష్మి శ‌రత్‌కుమార్
X

2018 నుంచి మీటూ ఉద్య‌మం ఊపందుకుంది. అదే స‌మ‌యంలో అన్ని సినీప‌రిశ్ర‌మ‌ల్లో న‌టీమ‌ణులు త‌మ‌కు ఎదురైన వేధింపుల గురించి ఓపెన‌య్యారు. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ త‌న‌కు ఎదురైన వేధింపుల గురించి ఎంతో ధైర్యంగా మీటూ వేధిక‌గా త‌న గ‌ళం విప్పారు. సౌత్ సినీప‌రిశ్ర‌మ నుంచి ధైర్యంగా మొద‌టిసారి మీటూ వేదిక‌కు వ‌చ్చిన న‌టిగా వ‌ర‌ల‌క్ష్మి పేరు ప్ర‌ముఖంగా హైలైట్ అయింది. ఒక పెద్ద‌ మీడియా చానెల్ అధినేత‌ త‌న‌తో త‌ప్పుగా వ్య‌వ‌హ‌రించార‌ని అప్ప‌ట్లో వ‌ర‌ల‌క్ష్మి ఆరోపించారు. అంతేకాదు.. అత‌డిపై పోలీస్ కేసు కూడా ఫైల్ చేసారు.

ఇప్పుడు మ‌రోసారి ఇదే విష‌యాన్ని ప్ర‌ముఖ తెలుగు యూట్యూబ్ చానెల్ హోస్ట్, జ‌ర్న‌లిస్ట్ ప్ర‌భుతో మాట్లాడుతూ మ‌రోసారి స్ప‌ష్టంగా త‌న విష‌యంలో జ‌రిగిన నాటి సంగ‌తిని రివీల్ చేసారు. ఒక ప్రాజెక్ట్ విష‌య‌మై మాట్లాడేందుకు పెద్ద‌ చానెల్ య‌జ‌మాని త‌న ఇంటికి వ‌చ్చార‌ని, ఆ త‌ర్వాత ప్రాజెక్ట్ గురించి అంతా బాగానే మాట్లాడుకున్నామ‌ని వ‌ర‌ల‌క్ష్మి తెలిపారు. అత‌డు వెళ్లేట‌ప్పుడు నెక్ట్స్ ఎప్పుడు క‌లుద్దాం? అని అడిగాడు. దేనికోసం అని ప్ర‌శ్నించాను... ఫ‌ర్‌ద‌ర్ (ఇత‌ర‌) విష‌యాలు మాట్లాడ‌టానికి క‌లుద్దామ‌ని అన్నాడు.. మీరు బ్యాడ్ మూడ్ లో ఉన్నారు.. త‌ర్వాత మాట్లాడతాను అని అత‌డు అన్నారు. రూమ్ బుక్ చేస్తాన‌ని కూడా అన్నాడు.. అని వ‌ర‌ల‌క్ష్మి తెలిపారు.

అత‌డు నా ఇంటికే వ‌చ్చి ఇలా అన్నాడు. అందుకే వెంట‌నే నేను కేస్ ఫైల్ చేసాను. నా ఇంటికే వ‌చ్చి అంత పెద్ద ఫ్యామిలీ అమ్మాయితోనే ఇలా ప్ర‌వ‌ర్తించాడు. సాధార‌ణ అమ్మాయిల‌తో అత‌డు ఎలా ప్ర‌వ‌ర్తిస్తున్నాడో అనిపించింది. అందుకే వెంట‌నే నేను న‌డిపిస్తున్న `సేవ్ శ‌క్తి` అనే ఎన్జీవో ద్వారా అత‌డిపై కేస్ ఫైల్ చేసాను అని వ‌ర‌ల‌క్ష్మి నాటి విష‌యాన్ని స్ప‌ష్ఠంగా వెల్ల‌డించారు.

శ‌ర‌త్ కుమార్ అంత పెద్ద న‌టుడి కుమార్తెకే ఇలా జ‌రిగింది? అంటే ఇత‌ర న‌టీమ‌ణుల ప‌రిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలి... అని హోస్ట్ వ్యాఖ్యానించ‌గా, తాను ఈ విష‌యంలో క‌ల‌త చెందాన‌ని వ‌ర‌ల‌క్ష్మి అన్నారు. న‌టిగా కెరీర్‌లో ఇలాంటివి ఎన్నో ఎదుర‌య్యాయి. చాలా ప్రాజెక్టులు వ‌దులుకున్నాన‌ని వ‌ర‌ల‌క్ష్మి వెల్ల‌డించారు. అయితే ఎన్ని తిర‌స్క‌ర‌ణ‌లు ఉన్నా కానీ, ఇప్ప‌టికీ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ రంగంలో క్యారెక్ట‌ర్ ఉండ‌డ‌మే క్యారెక్ట‌ర్ బ్యాడ్ అన్న‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతుంద‌న్న చ‌ర్చా ఆ ఇద్ద‌రి మ‌ధ్యా సాగింది.