Begin typing your search above and press return to search.

వరలక్ష్మి క్యారెక్టర్స్.. అలా అనుకుంటే పొరపాటే

సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా వరలక్ష్మి శరత్ కుమార్ సౌత్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది

By:  Tupaki Desk   |   17 Jan 2024 11:30 PM GMT
వరలక్ష్మి క్యారెక్టర్స్.. అలా అనుకుంటే పొరపాటే
X

సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా వరలక్ష్మి శరత్ కుమార్ సౌత్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. పాజిటివ్ నెగిటివ్ రోల్స్ అని తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటున్న విధానం కెరీర్ కు మరింత బూస్ట్ ఇస్తోంది. సినిమా సినిమాకు ఆమె క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలోనే ఇప్పుడు అమ్మడికి చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి.

ఆమె నటించిన ఏదో ఒక సినిమా సంక్రాంతి టైంలో రావడమే కాకుండా మంచి సక్సెస్ కూడా అవుతున్నాయి. అంతేకాకుండా ఆ సినిమాలలో ఆమె క్యారెక్టర్ ఎక్కువగా చనిపోతూ ఉండడం ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఇది అనుకోకుండా జరిగే పరిణామమే అయినప్పటికీ కూడా ఇండస్ట్రీలో ఆ సెంటిమెంట్ అలా హైలైట్ అవుతోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ మొదట తమిళంలో హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది.

అయితే హీరోయిన్ గా ఆమెకు పెద్దగా గుర్తింపు రాకపోవడంతో అమ్మడు ఆ తర్వాత విలన్ క్యారెక్టర్స్ తో మంచి క్రేజ్ అందుకుంది. ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది మాత్రం విజయ్ సర్కార్ సినిమానే. అందులో పవర్ఫుల్ విలన్ గా ఆమె కేవలం తన లుక్స్ తోనే అదరగొట్టేసింది. ఇక తర్వాత తెలుగులో క్రాక్ సినిమా ఆమెకు మరింత పేరు తెచ్చింది.

అనంతరం వీర సింహారెడ్డి లో హీరో చెల్లెలిగా కూడా నెగిటివ్ షేడ్స్ లో మరింత హైలెట్ అయ్యింది. ఇక రీసెంట్ గా వచ్చిన హనుమాన్ సినిమాలో కూడా హీరోకు సోదరి పాత్రలో కనిపించింది. అయితే ఈ మూడు సినిమాలు సంక్రాంతికి రాగా అన్నింటిలోనూ ఆమె క్యారెక్టర్స్ అన్నీ కూడా కథలో చనిపోతాయి. ఇక వరలక్ష్మి చనిపోయే క్యారెక్టర్స్ ఇస్తే సక్సెస్ అవుతాయి అనుకుంటే పొరపాటే.

ఒక విధంగా సినిమా కంటెంట్ కూడా క్లిక్ అయింది కాబట్టి ఆమె చేసిన పాత్రలకు కూడా మరింత బలం వచ్చింది. ఇక వరలక్ష్మి అయితే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో క్యారెక్టర్స్ ఉంటే వెంటనే రిజెక్ట్ చేస్తోంది. కొన్ని చిన్న సినిమాలలో కూడా ఆమె చేసిన పాత్రలు అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అల్లరి నరేష్ నాంది సినిమాకు చాలా తక్కువ పారితోషికం తీసుకుని లాయర్ గా కనిపించింది. ఆ విధానం నటనపై ఆమెకు ఉన్న మక్కువను తెలియజేస్తోంది.

అలాగే సమంత యశోద సినిమా, సందీప్ కిషన్ మైకేల్ సినిమాలలో కూడా ఆమె పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. రీసెంట్ గా వచ్చిన కోటబొమ్మాలిలో కూడా వరలక్ష్మి మంచి పాత్రలోనే కనిపించింది. ఇక ప్రస్తుతం ఆమె కథానాయకగా శబరి అనే ఒక సినిమా చేస్తోంది. మరి ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.