Begin typing your search above and press return to search.

వ‌ర‌ల‌క్ష్మి సిగ‌రెట్ క‌హానీ ఇంట్రెస్టింగ్!

కోలీవుడ్ న‌టి వ‌ర‌ల‌క్ష్మి టాలీవుడ్ లోనూ ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది. స్టార్ హీరోల చిత్రాల‌తో పాటు మీడియం చిత్రాల్లోనే కీల‌క పాత్ర‌ల‌కు ఎంపిక‌వుతుంది

By:  Tupaki Desk   |   18 Nov 2023 7:45 AM GMT
వ‌ర‌ల‌క్ష్మి సిగ‌రెట్ క‌హానీ ఇంట్రెస్టింగ్!
X

కోలీవుడ్ న‌టి వ‌ర‌ల‌క్ష్మి టాలీవుడ్ లోనూ ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది. స్టార్ హీరోల చిత్రాల‌తో పాటు మీడియం చిత్రాల్లోనే కీల‌క పాత్ర‌ల‌కు ఎంపిక‌వుతుంది. అమ్మ‌డి వాయిస్...ఆహార్యం...కొన్ని ర‌కాల ప్ర‌త్యేక ల‌క్ష‌ణాలు టాలీవుడ్ అటెన్ష‌న్ డ్రా చేస్తుంది. వీర‌సింహారెడ్డిలో బాల‌య్య‌కి ధీటుగా విల‌న్ పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అందులో అమ్మ‌డు న‌ట‌న ప‌రంగా మంచి మార్కులు ప‌డ్డాయి.

కానీ ఆహార్యంలో కొన్ని ర‌కాల మార్పులు చేస్తే బాగుండ‌నిపంచింది. రూపంలో సైతం మార్పులు తీసుకొస్తే అలాంటి పాత్ర‌లు ఇంకా బ‌లంగా పండ‌టానికి అవ‌కాశం ఉంటుంద‌ని పీబ్ బ్యాక్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం 'కోట‌బొమ్మాళి పీఎస్' అనే చిత్రంలో న‌టిస్తోంది. ఇందులో వైవిథ్య‌మైన పాత్ర‌తో మెప్పించ‌డానికి రెడీ అవుతుంది. రిలీజ్ సంద‌ర్భంగా అమ్మ‌డు సినిమాలో త‌న పాత్ర గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు షేర్ చేసింది.

సినిమాలో ఓసీన్ డిమాండ్ చేయ‌డంతో సిగ‌రెట్ కాల్చాల్సి వ‌చ్చంది. అలాంటి స‌న్నివేశంలో ఎప్పుడూ న‌టించ‌లేదు. తొలిసారి ఇదే న‌టించ‌డం. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. పొగ ప‌డదు. పాత్ర డిమాండ్చేసింది కాబ‌ట్టి న‌టించాల్సి వ‌చ్చింది. లేదంటే అలాంటి స‌న్నివేశాలు చేసేదాన్ని కాదు. న‌టిగా ప్ర‌త్యేకంగా ఎలాంటి ల‌క్ష్యాలు లేవు. ఏ పాత్ర చేసినా తెర‌పై ప్ర‌భావవంతంగా క‌నిపించాలి.

ప్రేక్ష‌కుల‌కు చేరువ అవ్వాలి. వ‌ర‌ల‌క్ష్మి భ‌లే పాత్ర చేసింద‌ని అంద‌రితో అనిపించుకోవాలి. అలాంటి ప్ర‌శంస కోసం ఎదురు చూస్తున్నాను. అలాంటి పాత్ర వ‌స్తుంద‌ని అంతే ఆశ‌గానూ ఉన్నాను. ప్ర‌స్తుతం వ‌స్తోన్న పాత్ర‌ల ప‌రంగా చాలా సంతృప్తిగా ఉన్నాను. ఫ‌లానా పాత్ర‌లోనే న‌టించాల‌ని ప్యాంటసీ అంటూ లేదు. నా దృష్టిలో క‌థే హీరో. ఆ త‌ర్వాతే ఎవ‌రైనా. క‌థ‌ని..పాత్ర‌ని న‌మ్మి సినిమాలు ఎంపిక చేసుకుంటాను. నాకు భాష‌తో సంబంధం లేదు. ఏ భాష‌లో అవ‌కాశాలు వ‌చ్చినా అక్క‌డ రెక్క‌లు క‌ట్టుకుని వాలిపోతాను' అని అంది.