కుమార్తె భవిష్యత్ కోసం ఇద్దరు భార్యలు ఒకే వేదికపై!
సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వం వహించిన `సరస్వతి` చిత్ర ట్రైలర్ లాంచ్, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శరత్ కుమార్ మొదటి భార్య ఛాయాదేవి పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు.
By: Sivaji Kontham | 1 March 2026 7:21 PM ISTసీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వం వహించిన `సరస్వతి` చిత్ర ట్రైలర్ లాంచ్, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శరత్ కుమార్ మొదటి భార్య ఛాయాదేవి పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ వేదికపై ఆమె మాట్లాడిన తీరు, పాజిటివ్ యాటిట్యూడ్ నెటిజన్ల మనసు గెలుచుకుంది.
ఆ వేడుకలో ఛాయాదేవి .. రాధిక గురించి మాట్లాడుతూ.. ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె మాటలను బట్టి వారి మధ్య ఎటువంటి విబేధాలు లేవని.. ఎంతో గౌరవంతో ఉన్నారని స్పష్టమైంది. ఈ హుందాతనాన్ని చూసి నెటిజన్లు `నిజమైన పరిణతి అంటే ఇదే` అని ప్రశంసిస్తున్నారు. ఛాయాదేవి ప్రసంగం మొత్తం చాలా ఫ్లూయెంట్‌గా, బ్రిలియంట్ ఇంగ్లీష్ స్కిల్స్‌తో సాగింది. ఆమె తన మాటలతో అందరినీ కట్టిపడేశారు.
కుమార్తె వరలక్ష్మి గురించి గర్వంగా..
వరలక్ష్మి మొదటిసారి మెగాఫోన్ పట్టి దర్శకురాలిగా మారడంపై ఛాయాదేవి ఎంతో గర్వపడ్డారు. వరలక్ష్మి చిన్నప్పటి నుంచి ఎంతో పట్టుదల ఉన్న అమ్మాయి అని.. ఈ సినిమా కోసం ఆమె పడిన కష్టం తప్పకుండా ఫలిస్తుందని ఆశీర్వదించారు. ఒక తల్లిగా తన కుమార్తె ఎదుగుదల చూసి ఆమె కళ్లలో ఆనందం స్పష్టంగా కనిపించింది.
శరత్ కుమార్ మొదటి భార్య ఛాయాదేవి.. ప్రస్తుత భార్య రాధిక ఒకే వేదికపై కనిపించి తమ మధ్య ఉన్న పరిణతిని చాటుకోవడం ఇదే మొదటి సారి కాదు. వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించింది శరత్ కుమార్ మొదటి భార్య ఛాయాదేవి. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో గతానికి సంబంధించిన విభేదాలు కనిపిస్తాయని అందరూ అనుకుంటారు.. కానీ ఛాయాదేవి తన అద్భుతమైన వ్యక్తిత్వంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ పెళ్లిని రాధిక స్వయంగా దగ్గర ఉండి మరీ జరిపించారు.
వరలక్ష్మి పెళ్లి అనంతరం ఛాయాదేవి మాట్లాడుతూ రాధిక గురించి ఎంతో గౌరవంగా మాట్లాడారు. రాధికపై తనకు ఎలాంటి ద్వేషం లేదని, వారిద్దరి మధ్య ఒక మంచి అవగాహన ఉందని తన మాటల ద్వారా స్పష్టమైంది. రాధిక కూడా ఛాయాదేవిని ఎంతో హుందాగా పలకరించడం విశేషం. తన కుమార్తె వరలక్ష్మి గురించి మాట్లాడుతూ ఛాయాదేవి ఎంతో గర్వపడ్డారు. వరలక్ష్మి తన కాళ్ల మీద తాను నిలబడి, ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా, కుటుంబ సభ్యులందరినీ ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించిందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ భవిష్యత్ కోసం ఇద్దరు మదర్స్ ఒకటిగా కలిసి కట్టుగా ఆలోచించడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. పిల్లల భవిష్యత్తు, కుటుంబ శాంతి కోసం ఇద్దరు భార్యలు ఇంత పరిణతితో వ్యవహరించడం చూసి నిజమైన సంస్కారం అంటే ఇదే! అని అందరూ కొనియాడుతున్నారు.
మొత్తానికి గతంలోని చేదు జ్ఞాపకాలను పక్కన పెట్టి.. పిల్లల ఆనందం కోసం ఒకే తాటిపైకి వచ్చిన శరత్ కుమార్ కుటుంబ సభ్యులు అందరికీ ఆదర్శంగా నిలిచారు. ముఖ్యంగా ఛాయాదేవి గారి హుందాతనం ఈ వేడుకకే హైలైట్‌గా నిలిచింది.
