Begin typing your search above and press return to search.

'పోలీస్ కంప్లైంట్' డైరెక్టర్ ఆరోపణలు.. వరలక్ష్మి అంతలా ఇబ్బంది పెట్టిందా?

చిన్న సినిమాలకు ప్రమోషన్స్ ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేస్తూ.. నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ పై పోలీస్ కంప్లైంట్ మూవీ డైరెక్టర్ సంజీవ్ మేగోటి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారాయి.

By:  M Prashanth   |   10 Jun 2026 11:52 PM IST
పోలీస్ కంప్లైంట్ డైరెక్టర్ ఆరోపణలు.. వరలక్ష్మి అంతలా ఇబ్బంది పెట్టిందా?
X

చిన్న సినిమాలకు ప్రమోషన్స్ ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేస్తూ.. నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ పై పోలీస్ కంప్లైంట్ మూవీ డైరెక్టర్ సంజీవ్ మేగోటి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారాయి. జూన్ 12వ తేదీన విడుదల కానున్న ఆ సినిమా ప్రమోషన్స్‌ లో భాగంగా హైదరాబాద్‌ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వరలక్ష్మిపై అసహనం వ్యక్తం చేశారు.

హారర్, యాక్షన్ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన పోలీస్ కంప్లైంట్ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది లీడ్ రోల్స్ లో నటించారు. అయితే సినిమా ప్రమోషన్స్‌ లో మెయిన్ లీడ్‌ గా నటించిన వరలక్ష్మి ఎక్కడా కనిపించకపోవడంపై దర్శకుడు స్పందించారు. "సినిమా కష్టం నిలబడాలంటే, సక్సెస్ అవ్వాలంటే వరలక్ష్మి లాంటి వాళ్లు ప్రెస్ మీట్స్‌ కు రావాలి. నిర్మాతల కష్టం నాకు తెలుసు. మార్నింగ్ షో పడే వరకు బాధ ఉంటుంది. ఆ బాధ వరలక్ష్మికి కూడా తెలుసు" అని సంజీవ్ అన్నారు.

డబ్బింగ్ విషయంలో చాలా ఇబ్బందులు పడ్డామని ఆయన తెలిపారు. "మా సినిమా ఫస్టాఫ్ డబ్బింగ్ చెప్పి, ఆవిడ సినిమా కోసం మూడు నెలలు డబ్బింగ్ రాకుండా ఏడిపించారు. రమ్మని పిలిచి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవారు. సెకండ్ హాఫ్ డబ్బింగ్ చెప్పడానికి మూడు నెలలు పట్టింది. ఫ్రీగా చేయలేదు కదా.. డబ్బులు తీసుకున్నారు కదా" అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

షూటింగ్ సమయంలో మాత్రం మూవీ టీమ్ ఆమెకు పూర్తిగా సహకరించిందని చెప్పారు. "షూటింగ్ టైమ్‌ లో చేయి విరిగిపోతే రెండు నెలలు గ్యాప్ తీసుకుని వచ్చారు. చేతి కట్టుతో వస్తే నేను కథలో మార్పులు చేశా. కొన్ని సీన్స్ లో కట్టుతో ఉండేలా ప్లాన్ చేశా. అంతేకాదు.. వారం రోజుల పాటు రోజూ మధ్యాహ్నం వరకే షూట్ చేశా. ఆవిడ కోసమే అలా చేశాం. మూవీ టీమ్ అంతా కోపరేట్ చేసింది" అని పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రమోషన్స్‌ కు దూరంగా ఉండటంపై ఆయన రెస్పాండ్ అయ్యారు. "ఇప్పుడు ప్రమోషన్స్‌ కు చిన్న పిల్లలు కూడా వచ్చారు. పెద్ది సినిమాకు రామ్ చరణ్ ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. మూవీ కూడా బాగుంది. బూస్ట్ చేయాలని ఇంకా ట్రై చేస్తున్నారు. 94 ఏళ్ల వయసులో కూడా దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తన కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రెస్ మీట్లకు వస్తున్నారు. సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. కానీ వరలక్ష్మి ఎందుకు రారు?" అని ప్రశ్నించారు.

అంతే కాదు ఆమె మేనేజర్ తీరుపైనా ఆయన అసహనం వ్యక్తం చేశారు. "వాళ్ల మేనేజర్ కూడా ఆన్సర్ లేదు. డబ్బుల కోసం ఎప్పుడూ ఫోన్ చేయడమే. డబ్బింగ్‌ కు రావాలన్నా డబ్బులు అడుగుతారు. కానీ ఇప్పుడు ప్రమోషన్స్ చేయకపోవడం వల్ల ఇబ్బంది. సినిమా కోసం టైమ్‌ కు వస్తారు. కష్టపడతారు. కానీ ప్రమోషన్స్‌ లో కూడా కష్టపడాలి. ఇది చాలా అన్యాయం" అని అన్నారు. "జూన్ 12న 350 థియేటర్లలో రిలీజ్ అవుతోంది. అది మూవీ టీమ్ వల్లనే. వరలక్ష్మి వల్ల కాదు. గంట అయినా ప్రమోట్ చేయాలని అడిగినా రాలేదు. మేమే నష్టపోయాం" అంటూ సంజీవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దర్శకుడు చేసిన ఆరోపణలపై వరలక్ష్మి నుంచి ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.