హాలీవుడ్ లోకి వరలక్ష్మి శరత్ కుమార్.. ఏ మూవీ చేస్తుందంటే?
నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి అందరికీ తెలిసిందే. కోలీవుడ్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మడు.. తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.
By: Tupaki Desk | 25 Jun 2025 4:22 PM ISTనటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి అందరికీ తెలిసిందే. కోలీవుడ్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మడు.. తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. వేరే లెవెల్ లో తన సినిమాలతో మెప్పిస్తోంది. టాలీవుడ్ లో కూడా ఆడియన్స్ కు దగ్గరైంది. అన్ని భాషల్లో మంచి ఛాన్సులు ఆమె సొంతమవుతున్నాయి.
టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుందనే చెప్పాలి. ఇప్పుడు హాలీవుడ్ లో కూడా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది వరలక్ష్మి. వెటరన్ డైరెక్టర్ చంద్ర రత్నం దర్శకత్వం వహిస్తున్న RIZANA-A Caged Bird మూవీతో హాలీవుడ్ లో ఆమె సందడి చేయనుంది. బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ సరసన కనిపించనుంది.
వాస్తవ సంఘటనల ఆధారంగా మూవీ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వగా.. శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం శ్రీలంకలో షూట్ చేస్తున్నారు మేకర్స్. త్వరలో మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారు. అయితే వరలక్ష్మికి ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు, సినీ ప్రియులు, పలువురు సెలబిట్రీలు బెస్ట్ విషెస్ చెబుతున్నారు.
ఇక వరలక్ష్మి కెరీర్ విషయానికొస్తే.. మొదట హీరోయిన్ గా అరంగేట్రం చేసిన ఆమె.. ఆ తర్వాత లేడీ విలన్ గా మారిపోయింది. పోదా పొడి మూవీ ఆమె సినీ జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత పలు సినిమాల్లో ఫిమేల్ లీడ్ రోల్స్ లో నటించిన వరలక్ష్మి.. లేడీ విలన్ గా ఛేంజ్ అయిన విషయం తెలిసిందే. తన నటనతో ఆకట్టుకుంటోంది.
ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే, మరోవైపు నటిగా లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్టుల్లో యాక్ట్ చేస్తోంది. గత ఏడాది హనుమాన్, రాయన్, మ్యాక్స్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది అమ్మడు. 2025లో స్టార్టింగ్ లో ఎప్పుడో కెరీర్ ప్రారంభంలో నటించిన మద గజ రాజా మూవీతో హిట్ సొంతమైంది.
ప్రస్తుతం విజయ్ దళపతి జన నాయగన్ మూవీలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న వరలక్ష్మి.. శివంగిలో కూడా నటిస్తోంది. మరిన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో కూడా ఆమె భాగమైంది. సినిమాలతో పాటు పలు టీవీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు హాలీవుడ్ లో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. మరి హాలీవుడ్ డెబ్యూతో ఎలాంటి హిట్ వరలక్ష్మికి దక్కుతుందో వేచి చూడాలి.
