Begin typing your search above and press return to search.

వ‌ర‌ల‌క్ష్మి విల‌న్ గా షైన్ అవ్వాలంటే!

యంగ్ హీరోల‌కు ప‌ర్పెక్ట్ విల‌నీగా మెప్పిస్తుంది. అందులో నో డౌట్ . కానీ సీనియ‌ర్ హీరోల విష‌యానికి వ‌చ్చేస‌రికి వ‌ర‌ల‌క్ష్మి స‌త్తా స‌రిపోవ‌డం లేద‌నే టాక్ వినిపిస్తుంది.

By:  Tupaki Desk   |   31 Oct 2023 3:15 AM GMT
వ‌ర‌ల‌క్ష్మి విల‌న్ గా షైన్ అవ్వాలంటే!
X

కోలీవుడ్ న‌టి వ‌ర‌లక్ష్మి పెర్పార్మెన్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆమె గ్రేట్ పెర్పార్మ‌ర్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా నెగిటివ్ పాత్ర‌లు పోషించాలంటే? ఆమెకు మాత్ర‌మే సాధ్యం అన్నంత‌గా కోలీవుడ్ లో ఫేమ‌స్ అయింది. అమ్మ‌డి గొంతు..క‌ళ్లు..ఆహార్యం ప్రతి నాయిక పాత్ర‌ల‌కు ప‌క్కాగా యాప్ట్ అవుతుంది. హీరోయిన్ అవ్వాల‌ని ఎంట్రీ ఇచ్చింది గానీ...ప‌రిశ్ర‌మ అమ్మ‌డిని విల‌నీని చేసింది.

యంగ్ హీరోల‌కు ప‌ర్పెక్ట్ విల‌నీగా మెప్పిస్తుంది. అందులో నో డౌట్ . కానీ సీనియ‌ర్ హీరోల విష‌యానికి వ‌చ్చేస‌రికి వ‌ర‌ల‌క్ష్మి స‌త్తా స‌రిపోవ‌డం లేద‌నే టాక్ వినిపిస్తుంది. ఇటీవ‌లే బాల‌కృష్ణ హీరోగా న‌టించిన 'వీర‌సింహారెడ్డి' లో విల‌నీగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. వాయిస్...ఎక్స్ ప్రెష‌న్స్..డైలాగ్ డైలివిరీ ప్ర‌తీది ప‌క్కాగా చేసింది. కానీ ఆహార్యం విష‌యంలో మాత్రం బాల‌య్య‌కి ధీటుగా క‌నిపించ‌లేద‌నే విమ‌ర్శ తెరపైకి వ‌స్తోంది.

బాల‌య్య లాంటి మాస్ హీరోకి లేడీ విల‌న్ అంటే అంతే ప‌వ‌ర్ ఫుల్ గా ఉండాలి. ఆహార్యంలో చాలా ర‌కాల మార్పులు తీసుకురావాలి. ముఖ్యంగా వ‌ర‌ల‌క్ష్మి ని పూర్తి స్థాయిలో విల‌నీగా ప్రోజెక్ట్ చేయ‌లంటే? అమ్మ‌డు వె యిట్ పెర‌గాల‌నే వాద‌న తెర‌పైకి వ‌స్తోంది. 60 ఏళ్ల పైబ‌డిన సీరియ‌ర్ హీరోల్ని మ్యాచ్ చేయాలంటే? వెయిట్ తో పాటు వ‌య‌సు ముదిరిన న‌టిగానూ చూపించాలంటున్నారు. 'వీర‌సింహారెడ్డి'లో డైలాగులు.. న‌ట‌న‌తో ఆకట్టుకున్నా వ‌య‌సు మిస్ మ్యాచ్ అయింద‌ని అంటున్నారు.

టాలీవుడ్ లో లేడీ విల‌న్లు లేని నేప‌థ్యంలో వ‌ర‌ల‌క్ష్మికిది మంచి అవ‌కాశం. చిరంజీవి.. నాగార్జున ..వెంక‌టేష్ లాంటి సీనియ‌ర్ హీరోల‌కు వ‌ర‌ల‌క్ష్మి విల‌నీగా ప‌క్కాగా యాప్ట్ అవుతుంది. లుక్ ప‌రంగా కొన్ని ర‌కాల మార్పు లు తీసుకురాగ‌లిగితే కోలీవుడ్ ని మించి టాలీవుడ్ లో చ‌క్రం తిప్ప‌గ‌ల‌దు. ప్ర‌స్తుతం వ‌ర‌ల‌క్ష్మి కోలీవుడ్ లో బిజీ న‌టిగా కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే