Begin typing your search above and press return to search.

ఏడాది చివ‌రిలో వ‌రూ పెళ్లి

పందెంకోడి సీక్వెల్లో విశాల్ కి విల‌న్ గా న‌టించి మెప్పించింది వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్.

By:  Tupaki Desk   |   26 April 2024 5:33 AM GMT
ఏడాది చివ‌రిలో వ‌రూ పెళ్లి
X

పందెంకోడి సీక్వెల్లో విశాల్ కి విల‌న్ గా న‌టించి మెప్పించింది వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్. ఇటీవ‌ల బ్లాక్ బ‌స్ట‌ర్ హ‌నుమాన్ లో కీల‌క పాత్ర‌తో మెప్పించింది వ‌రూ. కోలీవుడ్ టాలీవుడ్ లో చెప్పుకోద‌గ్గ సినిమాల్లో అవ‌కాశాలు అందుకుంది. న‌టిగా స‌త్తా చాటి కెరీర్ ప‌రంగా వ‌ర‌ల‌క్ష్మి బిజీగా ఉంది.

ఇంత‌లోనే వ్య‌క్తిగ‌తంగా గుడ్ న్యూస్ చెప్పింది. ముంబైకి చెందిన పాపుల‌ర్ గ్యాలరిస్ట్ (ఆర్టిస్ట్).. తన చిరకాల ప్రియుడు నికోలాయ్ సచ్‌దేవిని పెళ్లాడుతున్నాన‌ని ప్ర‌క‌టించింది. అత‌డితో నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ఇంత‌కుముందే ఆన్ లైన్ లో రిలీజ‌య్యాయి. పందెం కోడి వ‌రూ ఒక ఇంటిది అవుతోంది అంటూ అభిమానులు సంబ‌రాలు చేసుకున్నారు.

ఇదిలా ఉంటే, వ‌ర‌లక్ష్మి నిశ్చితార్థం అయ్యాక ఇంకా పెళ్లి తేదీని ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంపై సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ పెళ్లి వాయిదా ప‌డింది! అంటూ ప్ర‌చారం సాగుతోంది. తాజాగా ఈ ప్ర‌చారాన్ని వ‌రూ ఖండించింది. త‌మ కుటుంబం రాజ‌కీయంగా యాక్టివ్ గా ఉంది. పైగా ఎన్నికల ప్ర‌చారం బిజీలో ఉంది. అందువ‌ల్ల పెళ్లి తేదీని ఇంకా ప్ర‌క‌టించ‌లేక‌పోయామ‌ని తెలిపింది వ‌ర‌ల‌క్ష్మి. ఎన్నిక‌లు ముగిసాక తాపీగా వ‌రూ పెళ్లి ముచ్చ‌ట ఆ కుటుంబం చెబుతుందేమో చూడాలి. ఏడాది చివ‌రిలో పెళ్లి జ‌రుగుతంద‌ని కూడా వ‌ర‌ల‌క్ష్మి వెల్ల‌డించింది.

14 ఏళ్లుగా ప‌రిచ‌యం స్నేహం:

వ‌ర‌ల‌క్ష్మి పెళ్లాడే యువ‌కుడి పేరు నికోల‌య్ స‌చ్‌దేవ్‌. ముంబైకు చెందిన ప్ర‌ముఖ బిజినెస్‌మేన్‌. త‌ను ఒక ఆర్ట్ గ్యాలరీని కూడా నడుపుతున్నాడు. నికోల‌య్ స‌చ్‌దేవ్ ఆన్‌లైన్‌ వేదికగానూ వివిధ రకాల పెయింటింగ్‌లు, కళాకృతులను విక్రయిస్తుంటారు. అత‌డు సౌత్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌తో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత వార్తల్లో నిలిచారు. వీరి నిశ్చితార్థ వేడుక ముంబయిలో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. వరలక్ష్మికి అతనికి గ‌త ప‌ద్నాలుగేళ్లుగా ప‌రిచ‌యం.. కొంతకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. ప్రస్తుతం వీరిద్ద‌రూ త‌మ ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌లో బిజిగా ఉండ‌డంతో పెళ్లి తేదీపై స్ప‌ష్ఠ‌త‌నివ్వ‌లేదు. కుటుంబం రాజ‌కీయాల్లో బిజీగా ఉండ‌టం కూడా దీనికి మ‌రో కార‌ణం.

నికోలాయ్ సచ్‌దేవ్ కి బాలీవుడ్ లో మంచి ప‌రిచ‌యాలున్నాయి. అతడికి జాన్ అబ్రహం, సుస్మితా సేన్ స‌హా ఇంకా చాలా మంది స్నేహితులు ఉన్నారు. నికోలాయ్ పచ్చబొట్టు ప్రేమికుడు. అత‌డి శ‌రీరం నిండా టాట్టూలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. బాడీబిల్డింగ్ లోను నికోలాయ్ కి శ్ర‌ద్ధ ఎక్కువేనని అత‌డి రూపం వెల్ల‌డిస్తోంది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే వ‌ర‌ల్మి న‌టించిన తదుప‌రి చిత్రం శ‌బ‌రి మే 3న విడుద‌ల కానుంది.