Begin typing your search above and press return to search.

కొత్త పెళ్లి కూతురు ఉయ్యాలూగిన వేళ చూసారా?

కానీ ఎవ‌రూ ఊహించని విధంగా నిరాడంబ‌రంగా ముంబైలో నిశ్చితార్దం చేసుకుని స‌ర్ ప్రైజ్ చేసింది

By:  Tupaki Desk   |   6 March 2024 9:49 AM GMT
కొత్త పెళ్లి కూతురు ఉయ్యాలూగిన వేళ చూసారా?
X

న‌టి వ‌ర‌లక్ష్మి ఎంగేజ్ మెంట్ తో స‌ర్ ప్రైజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ముంబై బేస్డ్ బిజినెస్ మ్యాన్ నికోల య్ స‌చ్ దేవ్ తో ఎంగేజ్ మెంట్ చేసుకుని ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చింది. వ‌ర‌ల‌క్ష్మి స‌చ్ దేవ్ తో ల‌వ్ లో ఉన్న‌ట్లు ఎక్క‌డా గాసిప్ కూడా రాలేదు. సినిమాల్లోనే బిజీగా ఉంటుంది. అక్క‌డ స‌క్స‌స్ పైనే దృష్టి పెట్టి ప‌నిచేస్తుంది..ఇంకే వ్యాప‌కాలు లేవ‌న‌ట్లే వ‌ర‌ల‌క్ష్మి పేరు నెట్టింట వైర‌ల్ అయింది. కానీ ఎవ‌రూ ఊహించని విధంగా నిరాడంబ‌రంగా ముంబైలో నిశ్చితార్దం చేసుకుని స‌ర్ ప్రైజ్ చేసింది.

ఇక వ‌ర‌ల‌క్ష్మి ముస్తాబైన విధానం...వేడుకకు విచ్చేసిన అతిధుల డ్రెస్ కోడ్ అంతా ఎంతో ప్ర‌త్యేకంగా నిలిచింది. అంతా వైట్ అండ్ వైట్ లో త‌ళుక్కున మెర‌వ‌డం సంథింగ్ స్పెష‌ల్ గా నిలిచింది. తాజాగా నిశ్చితార్ధానికి సంబంధించిన వీడియో రీల్స్ రూపంలో నెట్టింట వైర‌ల్ అవుతుంది. కాబోయే వ‌ధువ‌రూ లిద్ద‌రు దండ‌లు మార్చుకోవ‌డం.. ప్రేమ‌తో ఆప్యాయంగా ఒక‌ర్ని ఒక‌రు కౌగిలించుకోవ‌డం.. కొత్త పెళ్లి కూతుర్ని స్నేహితులంతా చేతుల్లోకి తీసుకుని ఉయ్యాల ఉప‌డం...ఆ మొత్తం ఈవెంట్ లో ముఖ్య‌మైన వారిని శ‌ర‌త్ కుమార్ త‌న కెమెరాతో బంధించ‌డం.

ఆట పాట స‌ర‌దాతో ఎంతో వైభ‌వంగా ఆ వేడుక జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. స‌చిద్ వేడ్ పోడ‌వైన హెయిర్ స్టైల్ సంథింగ్ స్పెష‌ల్ గా హైలైట్ అవుతుంది. రీల్స్ రూపంలో వైర‌ల్ అవుతున్న వీడియోకి బ్యాక్ గ్రౌండ్ లో ఓ త‌మిళ సినిమా సాంగ్ ని సింక్ చేసి నెట్టింట వదిలారు. ప్ర‌స్తుతం ఆ రీల్ వైర‌ల్ అవుతుంది. ఆ వీడియోలో అంతా సంతోషాలే విర‌సిల్లాయి. వేడుక ఎంత వైభ‌వంగా జ‌రిగింద‌న్ని తెలియాలంటే వీడియో చూస్తే స‌రి.

ఇక న‌టిగా వ‌ర‌ల‌క్ష్మి బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ సినిమాలతో పాటు తెలుగు సినిమాలు చేస్తుంది. ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్ అవ‌కాశాలు పెరిగాయి. ఆమెనే మెయిన్ లీడ్ లో పెట్టి సినిమాలు చేస్తున్నారు. అలాగే స్టార్ హీరోల‌కు విల‌నీగానూ మంచి అవ‌కాశాలు అందుకుంటుంది. మ‌రి వివాహ‌మైన త‌ర్వాత ఇదే దూకుడు కొన‌సాగిస్తుందా? అన్న‌ది చూడాలి.