Begin typing your search above and press return to search.

వ‌ర‌ల‌క్ష్మి కి దెయ్యాలంటే భ‌య‌మా? కాదా

ఈ సిరీస్ ప్ర‌చారంలో భాగంగా హైదరాబాద్ లో హ‌ల్చ‌ల్ చేసిన అమ్మ‌డు హార‌ర్ సినిమాలు కేవ‌లం ఇంట్లే ప‌గ‌టి పూత్ర మాత్ర‌మే చూస్తుందిట‌.

By:  Tupaki Desk   |   17 Oct 2023 6:51 AM GMT
వ‌ర‌ల‌క్ష్మి కి దెయ్యాలంటే భ‌య‌మా? కాదా
X

దేవుడు..దెయ్యాల్ని న‌మ్మేవారున్నారు...నమ్మ‌ని వారున్నారు. రాంగోపాల్ వ‌ర్మ దేవుడు లేడ‌ని వాదిస్తాడు. అలాగే దెయ్యాల మీద అపార‌మైన న‌మ్మ‌కంతో సినిమాలు చేస్తాడు. దెయ్యాలున్నాయా? లేవా? అని అడిగితే స‌రైన స‌మాధానం మాత్రం చెప్ప‌డు. జ‌నాలు చూస్తున్నారు కాబ‌ట్టి నేను తీస్తున్నాను అంటాడు. మ‌రి కోలీవుడ్ న‌టి దెయ్యాల‌కు భ‌య‌ప‌డుతుందా? లేక ధైర్యంగా దెయ్యాల‌కైనా ఎదురెళ్తుందా? అంటే అమ్మ‌డు మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శించిన‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం ఆమె 'మాన్ష‌న్ 24' అనే వెబ్ సిరీస్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సిరీస్ ప్ర‌చారంలో భాగంగా హైదరాబాద్ లో హ‌ల్చ‌ల్ చేసిన అమ్మ‌డు హార‌ర్ సినిమాలు కేవ‌లం ఇంట్లే ప‌గ‌టి పూత్ర మాత్ర‌మే చూస్తుందిట‌. రాత్రుళ్లు చూడ‌ద‌ట‌. నిజానికి దెయ్యాల సినిమాలు రాత్రి స‌మ‌యంలో చూస్తే థ్రిల్..కిక్ దొరుకుతుంద‌ని అంతా అంటారు. ఆ జాన‌ర్ సినిమాలు ఇష్ట‌ప‌డే వారు రాత్రి పూటే వాటిని చూస్తారు.

కానీ వ‌ర‌ల‌క్ష్మి రాత్రి పూట వాటి జోలికి వెళ్ల‌దు. అలాగ‌ని దెయ్యాలంటే భ‌య‌మా? అంటే కాద‌న్న‌ట్లు మేక‌పోతుగాంభీర్యం ప్ర‌ద‌ర్శించింది. ఓ పాత్రికేయుడు దెయ్యం సినిమా చేస్తున్నారు? దెయ్యాలంటే భ‌య‌ప‌డ‌తారా? అంటే తాను ఏ సినిమా చేసినా ఆ సినిమా సెట్లో సాయంత్రం అన్ని వ‌దిలేసి వ‌స్తాన‌ని తెలిపింది. ఎంత స‌వాల్ తో కూడుకున్న పాత్ర అయినా దాని గురించి ఇంటికొచ్చిన త‌ర్వాత ఆలోచించి ఒత్తిడికి గుర‌వ్వ‌డం వంటివి చేయ‌న‌ని అంది.

అలాగే దేవుడ్ని న‌మ్ముతారా? అంటే త‌ప్ప‌కుండా అన్న‌ట్లు బ‌ధులిచ్చింది. డ‌బ్బింగ్ చెప్పేట‌ప్పుడే అన్ని ఎపిసోడ్లు చూసేసాను. సిరీస్ చాలా బాగా వ‌చ్చింది. ఓంకార్ చ‌క్క‌గా తెర‌కెక్కించారు. ప్రేక్ష‌కులంద రికీ న‌చ్చుతుంది అని అంది.