Begin typing your search above and press return to search.

ఇలియానాని స్కిప్ కొట్ట‌డ‌నికి కార‌ణాలు ఏంటో

ఇలియానా బ్యూటీ అందంలో కొట్టేదేవ‌రు? కానీ ఆమెని త‌ప్పించి వాణీ క‌పూర్ ని ఎంపిక చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

By:  Tupaki Desk   |   10 Jan 2024 3:15 AM GMT
ఇలియానాని స్కిప్ కొట్ట‌డ‌నికి కార‌ణాలు ఏంటో
X

అజ‌య్ దేవ‌గ‌ణ్ క‌థానాయ‌కుడిగా రాజ్ కుమార్ గుప్తా ద‌ర్శ‌క‌త్వంలో 'రెయిడ్' కి సీక్వెల్ గా 'రెయిడ్ -2' ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రారంభ‌మైన ఈ సినిమా ఓపెనింగ్ కి టాలీవుడ్ నుంచి ర‌వితేజ‌..ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ కూడా స్పెష‌ల్ ప్లైట్ లో హాజ‌ర‌వ్వ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప రిచింది. రెయిడ్ ని టాలీవుడ్ లో ర‌వితేజ రీమేక్ చేయ‌డంతోనే ఇలా ర్యాపో కోసం ఇద్ద‌రు హాజ‌ర‌య్యారు అన్న‌ది అంద‌రికీ తెలిసిన విష‌యం.

'రెయిడ్ 2' రైట్స్ కూడా ఈ ద్వ‌యం ద‌క్కించుకునే ప్లాన్ లో భాగంగానే ఇలా ముందుగానే క‌ర్చీప్ వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే బాలీవుడ్ రెయిడ్ మొద‌టి భాగంలో అజ‌య్ కి జోడీగా ఇలియానా న‌టించింది. ఆకాంబినేష‌న్ అప్ప‌ట్లో అభిమానుల్ని అల‌రించింది. కానీ ఇప్పుడు ఇలియానాని త‌ప్పించి ఆ స్థానంలో వాణీ క‌పూర్ ని తీసుకు రావ‌డం విశేషం. హీరో..ద‌ర్శ‌కుడు యధావిధిగా కొన‌సా గుతున్నా ఇలియానానిని త‌ప్పించ‌డం మాత్రం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇలియానా ఇప్ప‌టికీ అదే ఛ‌రిష్మాతో బాలీవుడ్ లో కొన‌సాగుతుంది. లుక్ ప‌రంగా కొన్ని ర‌కాల మార్పులైతే వ‌చ్చాయి త‌ప్ప‌! ఇలియానా బ్యూటీ అందంలో కొట్టేదేవ‌రు? కానీ ఆమెని త‌ప్పించి వాణీ క‌పూర్ ని ఎంపిక చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సాధార‌ణంగా సీక్వెల్స్ అంటే చాలా వ‌ర‌కూ పాత టీమ్ తోనే వెళ్తుంటారు. ఇది మరీ ఓల్డ్ సినిమాకి సీక్వెల్ కూడా కాదు. అందులో న‌టీన‌టులు పాత బ‌డిపోయారు అనుకోవ‌డానికి. మ‌రి ఇలియానాని స్కిప్ కొట్ట‌డ‌నికి కార‌ణాలు ఏంటో?

బాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ అన్న‌ది చాలా కాలంగా కొన‌సాగుతుంది. అక్క‌డ ట్రెండ్ ని చూసే మిగ‌తా ప‌రిశ్ర‌మ‌ల‌కు అది అల‌వాటైంది. ప్ర‌స్తుతం హిందీలో చాలా సినిమాల‌కు సీక్వెల్స్ తెర‌కెక్కుతున్నాయి. అలాగే మిగ‌తా ప‌రిశ్ర‌మ‌ల్లో సీక్వెల్స్ బ‌ధులుగా రెండు భాగాల కాన్సెప్ట్ తెర‌పైకి వ‌స్తుంది. అందులో టాలీవుడ్ ముందంజ‌లో ఉంది.