Begin typing your search above and press return to search.

వాణి ఏంటా వేడి? మ‌తి చెదిరేలా

త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ ఆదాయం ఇక్క‌డ క‌నిపించ‌డంతో బాలీవుడ్ బ్యూటీలు ఇన్ స్టాని ఓ వెప‌న్ లా వినియోగిస్తున్నారు.

By:  Tupaki Desk   |   1 Dec 2023 7:01 AM GMT
వాణి ఏంటా వేడి? మ‌తి చెదిరేలా
X

బాలీవుడ్ బ్యూటీ వాణీకపూర్ ఇన్ స్టాని హీటెక్కించడంలో తనదైన మార్క్ వేస్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు సొగ‌సైన‌ ఫోటోలతో మంటలు రేప‌డం సొగ‌స‌రి ప్ర‌త్యేక‌త‌. ఆల్ట్రా మోడ్ర‌న్ దుస్తుల్లోనూ అగ్గిరాజేస్తుంది. మార్కెట్ లో న్యూ ట్రెండ్స్ ని ప‌రిచ‌యం చేయ‌డంలోనూ ముందుంటుంది. సినిమాల క‌న్నా అధిక ఆదాయాన్ని ఇన్ స్టా ద్వారానే సంపాదిస్తుంది. త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ ఆదాయం ఇక్క‌డ క‌నిపించ‌డంతో బాలీవుడ్ బ్యూటీలు ఇన్ స్టాని ఓ వెప‌న్ లా వినియోగిస్తున్నారు. అందులో వాణీ క‌పూర్ ముందు వ‌రుస‌లో ఉందంటే? అతిశ‌యోక్తి కాదు.


తాజాగా క‌పూర్ బ్యూటీ మ‌రో కొత్త ఫోటోతో వాణీ లో వేడిని ఆవిష్కరించింది. ఇదిగో ఇక్క‌డిలో బెడ్ పై వివిధ భంగ‌మ‌ల్లో మ‌తి చెడ‌గొట్టే బాధ్య‌త‌లు తీసుకుంది. తెలుపు వ‌ర్ణం దుస్తుల్లో అందాల‌న్నీ ధారాళంగా ఆవిష్కరించింది. బెడ్ పై కూర్చుని అమ్మ‌డు వ‌య్యారంగా కెమెరా వైపు త‌ల తిప్పి చూస్తోన్న భంగిమ కుర్రాళ్ల‌ని లాక్ చేస్తుంది. దీనికో మంచి పేరు కూడా పెట్టారు. దీన్ని `పిల్లో టాక్` అంటారుట‌.


ఆ భంగిమ‌ని ఉద్దేశించి వాణీ క‌పూర్ ఇచ్చిన క్యాప్ష‌న్ అది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంతార్జాలంలో వైర‌ల్ గా మారింది. అభిమానులు సైతం అంతే దూకుడైన కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఫోటో..దానికిచ్చిన క్యాప్ష‌న్ బ‌ట్టి కుర్రాళ్లేం త‌గ్గ‌లేదు. ఎవ‌రి స్టైల్లో వారు సొంత క్యాప్ష‌న్లు ఇచ్చేసుకుంటున్నారు.

ఇక వాణీ క‌పూర్ సినిమాల సంగ‌తి చూస్తే గ‌తేడాది రిలీజ్ అయిన `శంషేరా`తో భారీ స‌క్సెస్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. అంత‌కు ముందు రిలీజ్ అయిన చాలా చిత్రాలతో నిరాశ‌ప‌రిచినా `శంషేరా` అన్ని ప‌రాజయాల్ని జ‌యించింది. దీంతో బ్యూటీ న‌టిగా బిజీ అవ్వడం ఖాయ‌మ‌న్నారంతా. కానీ వాణీ కెరీర్ ఆ విధంగా క‌నిపించ‌లేదు. `శంషేరా`లాంటి భారీ స‌క్సెస్ ఖాతాలో ఉన్నా ఇప్ప‌టివ‌ర‌కూ కొత్త సినిమాల‌కు సైన్ చేసింది లేదు. మ‌రి ఈ వెనుక‌బాటు త‌నం వెనుక కార‌ణాలు ఏంటి? అన్న‌ది తెలియాల్సి ఉంది.