రంగు లేదు బక్కగా కనిపిస్తోందని విమర్శించారు: వాణీ కపూర్
ఇదిలా ఉంటే, వాణీ కపూర్ తాజా ఇంటర్వ్యూలో తాను వర్ణ వివక్షను ఎదుర్కొన్నట్టు తెలిపింది.
By: Tupaki Desk | 24 July 2025 8:45 AM ISTయష్ రాజ్ ఫిలింస్ అస్థాన కథానాయికగా పాపులరైంది వాణీ కపూర్. ఈ భామకు ఆదిత్య చోప్రా మార్గదర్శకుడిగా నిలిచాడు. అతడు వరుసగా తమ బ్యానర్ సినిమాల్లో వాణీకి అవకాశం కల్పించాడు. అయితే వాణీ కెరీర్ ఆశించిన స్థాయికి మాత్రం చేరుకోలేదు. ఈ భామకు నటిగా నిరూపించుకునే గొప్ప అవకాశాలు కూడా రాలేదు. కేవలం కమర్షియల్ సినిమాల్లో గ్లామరస్ పాత్రల్లో మాత్రమే నటించింది.
ఇదిలా ఉంటే, వాణీ కపూర్ తాజా ఇంటర్వ్యూలో తాను వర్ణ వివక్షను ఎదుర్కొన్నట్టు తెలిపింది. తన శరీరం తగినంత తెల్లగా లేదని విమర్శలొచ్చాయని తెలిపారు. రంగు లేదు బక్కగా కనిపిస్తోంది! అంటూ కొందరు విమర్శించిన విషయాన్ని తాజాగా గుర్తు చేసుకుంది. సన్నగా పొడవుగా ఉండటం కూడా తనకు సమస్యలు తెచ్చి పెట్టిందని అన్నారు.
తదుపరి ఓటీటీలో వాణీ నటించిన `మండలా మర్డర్స్` విడుదలకు సద్ధమైంది. వాణీ గన్ చేతపట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లా కనిపిస్తోంది. ఈ షోలో తన నటనతో ఆకట్టుకుంటే, అది మరిన్ని అవకాశాలను కల్పిస్తుంది. గొప్ప నటప్రదర్శనతో హృదయాలను గెలుచుకుంటే పెద్ద తెర అవకాశాలు పెరుగుతాయనడంలో సందేహం లేదు.
