Begin typing your search above and press return to search.

వంగా - మహేష్.. యానిమల్ తప్పేమీ లేదు!

ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రతి సన్నివేశంలో కూడా సందీప్ తన మార్క్ మేకింగ్ ను చూపించాడు.

By:  Tupaki Desk   |   2 Dec 2023 10:29 AM GMT
వంగా - మహేష్.. యానిమల్ తప్పేమీ లేదు!
X

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. నార్త్ ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ అయితే వస్తోంది. ఒక విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వస్తున్నా రెస్పాన్స్ చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో సందీప్ రేంజ్ మరొక లెవల్ కు పెరిగిపోయే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రతి సన్నివేశంలో కూడా సందీప్ తన మార్క్ మేకింగ్ ను చూపించాడు. ముఖ్యంగా కొన్ని బోల్డ్ సీన్స్ లో హీరో క్యారెక్టర్ ను హైలెట్ చేసిన విధానం కూడా అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఆ పాత్రకు తగ్గట్టుగా కూడా రుణబీర్ కపూర్ నటించిన విధానం నెక్స్ట్ లెవెల్ అనే మాట వినిపిస్తోంది. అయితే ఇలాంటి సినిమాను మహేష్ ఎందుకు మిస్ చేసుకున్నాడు అనే అభిప్రాయాలు ఇంకా చాలానే వస్తున్నాయి.

ట్రైలర్ వచ్చినప్పుడే ఈ సినిమాకు ఏ స్థాయిలో బజ్ క్రియేట్ అయిందో ప్రత్యేకంగా చెప్పను అవసరం లేదు. అయితే మహేష్ ఈ సినిమా రిజెక్ట్ చేయడంలో తప్పేమీ కాదు అని చెప్పవచ్చు. దర్శకుడు సందీప్ మొదట అయితే మహేష్ కు యానిమల్ కదా చెప్పలేదు కానీ డెవిల్ అనే మరో కథ గురించి చెప్పాను అని అన్నాడు. అయితే ఇది మరీ అంత నమ్మేలా అయితే లేదు.

ముందుగా సందీప్ యానిమాల్ కథను మహేష్ కు చెప్పినట్లు స్ట్రాంగ్ గా టాక్ అయితే వినిపించింది. నిజంగానే ఇలాంటి కథ వచ్చినప్పుడు మహేష్ నిరాకరించినప్పటికీ అతడి తప్పేమీ కాదు అని చెప్పవచ్చు. ఎందుకు అంటే రెండు బీర్ కపూర్ స్టార్ ఇమేజ్ తో ఎలాంటి ప్రయోగాలు అయినా చేయవచ్చు. ఇక ఇలాంటి వైలెంట్ కథలు కూడా అతనికి బాగా సెట్ అవుతాయి. అయితే ఇదే తరహాలో మహేష్ బాబుతో చేయిస్తే మాత్రం అంతగా సెట్ అవ్వదు అని చెప్పవచ్చు.

మహేష్ బాబుకు ఫ్యామిలీ ఆడియన్స్ లో అలాగే లేడీ ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. అతను ఇలాంటి సినిమాలలో నటిస్తే ఆడియన్స్ పెద్దగా ఒప్పుకోకపోవచ్చు. అంతేకాకుండా యానిమల్ కథలో దర్శకుడు రియాలిటీ కి తగ్గట్టుగా కాస్త బూతు సైగలు బోల్డ్ రొమాంటిక్ సన్నివేశాలు హైలెట్ చేశాడు. హీరోయిన్ తో మాత్రమే కాకుండా మరొక అమ్మాయితో కూడా హీరో సినిమాలో శృంగారంలో పాల్గొనే సన్నివేశం కూడా చాలా బోల్డ్ గా ఉంటుంది.

కొన్ని మాటలు కూడా సినిమాలో ఘాటుగా ఉన్నాయి. ఒక విధంగా రణబీర్ కపూర్ కి పర్ఫెక్ట్ గానే సెట్ అయ్యాయి కానీ మహేష్ లాంటి సాఫ్ట్ ఇమేజ్ ఉన్న హీరో ఇలాంటి సన్నివేశాలను నటిస్తే అంతగా సెట్ అవ్వదు అని చెప్పవచ్చు. ఏది ఏమైనా సందీప్ రెడ్డి అని అనుకున్నా పాత్రను రణబీర్ కపూర్ తో పర్ఫెక్ట్ గా చేయించాడు. అయితే మహేష్ బాబు లాంటి హీరో కూడా దీన్ని చేయకపోవడమే ఉత్తమం.