ఆ గొడవంతా స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందా?
ఆ సినిమాలే వనవీర, సైక్ సిద్ధార్థ. వీటిలో వనవీర అనే సినిమా ముందుగా వానర అనే పేరుతో తెరకెక్కగా, తర్వాత వనవీరగా పేరు మార్చుకుంది.
By: Sravani Lakshmi Srungarapu | 1 Jan 2026 3:52 AM ISTఈ మధ్య సినిమా ప్రమోషన్స్ చాలా కొత్తగా చేస్తున్నారు. కొందరు డిఫరెంట్ గా తమ సినిమాను ఆడియన్స్ లోకి తీసుకెళ్తే మరికొందరు మాత్రం ఏదొక కాంట్రవర్సీతో తమ సినిమాకు హైప్ వచ్చేలా చేసుకుంటున్నారు. ఇంకొందరు కొత్తగా ఆలోచించి ఆడియన్స్ పల్స్ పట్టుకుని మూవీని ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఓ రెండు సినిమాలు మాత్రం డిఫరెంట్ స్ట్రాటజీని వాడి తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నాయి.
అవినాష్ హీరోగా వస్తున్న వనవీర
ఆ సినిమాలే వనవీర, సైక్ సిద్ధార్థ. వీటిలో వనవీర అనే సినిమా ముందుగా వానర అనే పేరుతో తెరకెక్కగా, తర్వాత వనవీరగా పేరు మార్చుకుంది. ఈ సినిమాతో అవినాష్ అనే కొత్త కుర్రాడు హీరోగా మరియు డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారిన సంగతి తెలిసిందే.
నందుపై అవినాష్ కామెంట్స్
తమ సినిమాలో కీలక పాత్రలో నటించిన ఓ యాక్టర్ ప్రమోషన్స్ కు రావడం లేదని, కనీసం సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టలేదని కామెంట్ చేయగా, ఆ కామెంట్స్ తనను ఉద్దేశించే చేశారని నందు చెప్పారు. నందు హీరోగా నటించిన సైక్ సిద్ధార్థ్ కూడా న్యూ ఇయర్ సందర్భంగానే రిలీజవుతుంది. అయితే వనవీరలో నందు విలన్ రోల్ చేశారు. వనవీర ప్రమోషన్స్ గురించి తనకు ముందు ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్లే తాను రాలేకపోయానని కూడా నందు ఆ విషయంలో క్లారిటీ ఇచ్చారు.
అయితే ఇప్పుడదంతా మర్చిపోయి ఈ రెండు సినిమాల్లోని లీడ్ యాక్టర్లు అవినాష్, నందు జాయింట్ గా తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. వీరిద్దరూ ఒకరి మీద ఒకరు చేసిన విమర్శలపై ఫన్నీగా ఓ వీడియోను తీసి దాంతో తమ సినిమాలకు హైప్ పెంచుకుంటున్నారు. అయితే ఇదంతా చూస్తున్న నెటిజన్లు మాత్రం ఇదంతా ఒక స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందని అంటుంటే, మరికొందరు మాత్రం తమపై వచ్చిన వివాదాల్ని కూడా ప్రమోషన్స్ కు అనుకూలంగా మార్చుకుని నందు, అవినాష్ చాలా బాగా సిట్యుయేషన్ ను డీల్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి వివాదాల కారణంగా మంచి హైప్ తెచ్చుకున్న ఈ సినిమాల్లో న్యూ ఇయర్ విన్నర్ గా ఎవరు నిలుస్తారో చూడాలి.
