టీజర్: లంకను తగలబెట్టే 'వానర' సేన
ఈ మధ్య చిన్న సినిమాలు పెద్ద కంటెంట్ తో వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. మైథాలజీ టచ్ ఉంటే ఆడియన్స్ ఇంకాస్త ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు.
By: Tupaki Desk | 28 Nov 2025 10:35 AM ISTఈ మధ్య చిన్న సినిమాలు పెద్ద కంటెంట్ తో వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. మైథాలజీ టచ్ ఉంటే ఆడియన్స్ ఇంకాస్త ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు అదే కోవలో 'వానర' అనే ఆసక్తికరమైన టైటిల్ తో ఒక సినిమా రాబోతోంది. తాజాగా రిలీజైన ఈ మూవీ టీజర్ సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా టీజర్ లో వినిపించిన వాయిస్, చూపించిన విజువల్స్ సినిమాపై క్యూరియసిటీని పెంచేలా ఉన్నాయి.
ఈ టీజర్ కు మెయిన్ హైలెట్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వాయిస్ ఓవర్. "అసలు వానరులు అంటే ఎవరు? ఆకతాయిలు, తెలివైనవారు, మంచి కంత్రీగాళ్లు కూడా" అంటూ విశ్వక్ తనదైన మాస్ స్లాంగ్ లో చెప్పిన ఇంట్రో అదిరిపోయింది. కేవలం వాయిస్ ఇవ్వడమే కాకుండా, సినిమాలోని హీరో క్యారెక్టరైజేషన్ ను ఎలివేట్ చేసేలా విశ్వక్ చెప్పిన విధానం టీజర్ కు పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది.
కథలో హనుమంతుడి రిఫరెన్స్ ను చాలా తెలివిగా వాడారు. "వీళ్లకు నచ్చిన వాటిని ఎవరైనా ఎత్తుకెళ్తే మాత్రం.. ఆఖరికి అది ఎత్తుకెళ్లింది రావణాసురుడైనా సరే లంకని మొత్తం తగలబెట్టేస్తారు" అనే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మోడరన్ డేలో ఉండే యువకులకు, పురాణాల్లోని వానర సేన లక్షణాలకు లింక్ పెడుతూ కథను రాసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
ఈ సినిమాతో అవినాష్ తిరువీధుల హీరోగా పరిచయం అవుతూనే, తానే స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. టీజర్ లో అతని స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ లో చూపించిన ఇంటెన్సిటీ ఆకట్టుకుంది. బైక్ రైడింగ్ షాట్స్, ఫైట్స్ చూస్తుంటే ఇదొక హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా అనిపిస్తోంది. హీరోయిన్ గా సిమ్రాన్ చౌదరి కనిపిస్తుండగా, నందు విలన్ గా ఒక వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.
టెక్నికల్ గా కూడా సినిమా స్ట్రాంగ్ గా ఉన్నట్లు టీజర్ చెబుతోంది. వివేక్ సాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది. సాయి మాధవ్ బుర్రా రాసిన పదునైన మాటలు టీజర్ లో హైలైట్ గా నిలిచాయి. సిల్వర్ స్క్రీన్ సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్ పై నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు విజువల్స్ చూస్తే తెలుస్తోంది.
మొత్తానికి 'వానర' టీజర్ తోనే సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశారు. మైథాలజీని మోడరన్ యూత్ లైఫ్ స్టైల్ కు కనెక్ట్ చేస్తూ చేసిన ఈ ప్రయోగం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.
