Begin typing your search above and press return to search.

వంశీ పైడిపల్లి ఏం చెక్కుతున్నాడు..?

ఇక వంశీ పైడిపల్లి నెక్స్ట్ సినిమా ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఆయన సినిమాలు కాకుండా మిగతా అన్ని విషయాల్లో వంశీ యాక్టివ్ గా ఉంటారు.

By:  Tupaki Desk   |   1 Feb 2024 5:30 PM GMT
వంశీ పైడిపల్లి ఏం చెక్కుతున్నాడు..?
X

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన వంశీ పైడిపల్లి దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టి 16, 17 ఏళ్లు అవుతున్నా సరే కేవలం ఆరు సినిమాలే చేశాడు. సినిమా సినిమాకు మూడు నాలుగేళ్లు గ్యాప్ తీసుకోవడం ఆయనకు అలవాటే. 2019 లో మహర్షి సినిమాతో వచ్చిన వంశీ పైడిపల్లి ఆ తర్వాత 3 ఏళ్ల తర్వాత కోలీవుడ్ స్టార్ విజయ్ తో వారిసు సినిమా చేశాడు. అదే తెలుగులో వారసుడు సినిమాగా రిలీజైంది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన వారిసు కోలీవుడ్ లో సూపర్ హిట్ కాగా తెలుగులో జస్ట్ ఓకే అనిపించుకుంది.

ఇక వంశీ పైడిపల్లి నెక్స్ట్ సినిమా ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఆయన సినిమాలు కాకుండా మిగతా అన్ని విషయాల్లో వంశీ యాక్టివ్ గా ఉంటారు. ఏదైనా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా.. సినిమా ప్రీమియర్స్ అన్నా సరే అందరి కన్నా ముందుంటాడు. కానీ తన సినిమాల వరకు వచ్చే సరికి ఏళ్లకు ఏళ్లు గ్యాప్ తీసుకుంటాడు. వంశీ పైడిపల్లి కావాలని అలా గ్యాప్ తీసుకుంటాడా లేక తన కథకు ఏ హీరో అయితే పర్ఫెక్ట్ అనుకుంటాడో ఆ హీరో కోసం ఎదురు చూస్తాడా అన్నది కూడా తెలియాల్సి ఉంది.

మహేష్ మహర్షి కోసం దాదాపు 3 ఏళ్ల దాకా వెయిట్ చేశాడు వంశీ పైడిపల్లి. అయితే మహేష్ వల్ల ఈ వెయిటింగ్ చేశాడని అనుకున్నా వారిసు తర్వాత మళ్లీ ఈ వెయిటింగ్ ఎందుకన్నది ఆయనకే తెలియాలి. తెలూ స్టార్ డైరెక్టర్స్ లో వంశీ పైడిపల్లి ఒకరు. మూడు నాలుగేళ్లకు ఒక సినిమా అది హిట్ టార్గెట్ చేసుకుని ఆయన సినిమాలు చేస్తున్నారు. ఇలా చేయడం ఆయనకు ప్యాషన్ కావొచ్చు కానీ వంశీ పైడిపల్లి రెగ్యులర్ గా సినిమాలు చేస్తే చూడాలని కోరుకునే ఫ్యాన్స్ ని ఆయన డిజప్పాయింట్ చేస్తున్నట్టే లెక్క.

వంశీ పైడిపల్లి నెక్స్ట్ సినిమా రేసులో ఉన్న హీరో ఎవరు. అసలు తర్వాత సినిమా గురించి ఏదైనా ఆలోచిస్తున్నాడా లేదా.. వంశీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే వంశీ పైడిపల్లి నోరు విప్పాల్సిందే. 3 ఏళ్ల గ్యాప్ తో ఒక సినిమా చేసి దాంతో హిట్ కొట్టి మళ్లీ 3 ఏళ్ల దాకా డైరెక్షన్ జోలికి వెళ్లని వంశీ పైడిపల్లి ఇక మీదట కూడా అలానే చేస్తాడా లేదా తన సినిమాలు కోరుకునే అభిమానుల కోసమైనా స్పీడ్ స్పీడ్ గా సినిమాలు చేస్తాడా అనేది చూడాలి.