Begin typing your search above and press return to search.

వంశీ పైడిప‌ల్లి..సురేంద‌ర్‌రెడ్డి సేమ్ టు సేమ్‌!

క్రేజీ స్టార్ల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్లు అందించిన ద‌ర్శ‌కులు గ‌త మూడేళ్లుగా సైలెంట్ కావ‌డం ప‌లువురిని క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది.

By:  Tupaki Entertainment Desk   |   3 Jan 2026 8:00 PM IST
వంశీ పైడిప‌ల్లి..సురేంద‌ర్‌రెడ్డి సేమ్ టు సేమ్‌!
X

క్రేజీ స్టార్ల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్లు అందించిన ద‌ర్శ‌కులు గ‌త మూడేళ్లుగా సైలెంట్ కావ‌డం ప‌లువురిని క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది. స్టార్ హీరోల‌తో సినిమాలు చేసిన ద‌ర్శ‌కులు ఇంత కాలం ఎందుకు సైలెంట్ అయ్యారు?..మిగ‌తా ద‌ర్శ‌కులంతా పాన్ ఇండియా రేసులో దూసుకుపోతుంటే ఓ ఇద్ద‌రు డైరెక్ట‌ర్లు మాత్రం గ‌త రెండు మూడేళ్లుగా సైలెంట్‌గా చూస్తూ ఉండిపోయారు. వారే వంశీ పైడిప‌ల్లి, స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డి. కెరీర్ గ్యాప్ విష‌యంలో వీరిద్ద‌రి ప‌రిస్థితి సేమ్ టు సేన్ అన్న‌ట్టుగా మారింది. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించిన మూవీ 'మ‌హ‌ర్షి'.

దిల్ రాజు, శిరీష్‌, సి. అశ్వ‌నీద‌త్‌, ప్ర‌సాద్ వి. పొట్లూరి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నేష‌న‌ల్ ఫిల్మ్ అవార్డుల్లో బెస్ట్ పాపుల‌ర్ ఫిలిం అవార్డుని సొంతం చేసుకుంది. బెస్ట్ డైరెక్ట‌ర్ సైమా అవార్డ్‌ని కూడా వంశీ పైడిప‌ల్లికి అందించింది. ఈ మూవీ త‌రువాత రెండేళ్లు విరామం అనంత‌రం ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో వంశీ పైడిప‌ల్లి 'వారిసు' మూవీ చేశాడు. త‌మిళంలో చేసిన ఈ సినిమాని తెలుగులో 'వార‌సుడు' పేరుతో రిలీజ్ చేయ‌డం బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు రూ.300 కోట్లు రాబ‌ట్ట‌డం తెలిసిందే.

ఈ మూవీ విడుద‌లై దాదాపు మూడేళ్లు కావ‌స్తున్నా వంశీ పైడిప‌ల్లి నుంచి మ‌రో సినిమా అప్‌డేట్ లేదు. 'మ‌హ‌ర్షి' త‌రువాత మ‌హేష్‌తో సినిమా చేయాల‌ని ప్లాన్ చేసుకున్నా అది వ‌ర్క‌వుట్ కాలేదు. త‌రువాత కూడా కుద‌ర‌క‌పోవ‌డంతో ప్ర‌స్తుతం త‌న‌కు డేట్స్ ఇచ్చే హీరో కోసం వంశీ పైడిప‌ల్లి వెతుకుతున్నాడ‌ట‌. ఇదే క్ర‌మంలో బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్‌తో వంశీ పైడిప‌ల్లి నెక్స్ట్ మూవీ ఉంటుంద‌నే వార్త‌లు వినిపించాయి. దాన్ని దిల్ రాజు నిర్మిస్తాడ‌ని కూడా ప్ర‌చారం జరిగింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు దాని ఊసే లేదు.

సురేంద‌ర్‌ రెడ్డిది కూడా ఆల్‌మోస్ట్ ఇలాంటి ప‌రిస్థితే న‌డిచింది నిన్న మొన్న‌టి వ‌ర‌కు. స్టైలిష్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న సురేంద‌ర్‌ రెడ్డి 2023లో చేసిన స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'ఏజెంట్‌'. అఖిల్ హీరోగా, మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ డిజాస్ట‌ర్‌గా నిలిచి అఖిల్ తీవ్ర మ‌న‌స్థాపానికి గుర‌య్యేలా చేసింది. ఈ సినిమా ఫ‌లితంతో తీవ్ర నిరాశ‌కు గురైన అఖిల్ దాన్ని మ‌ర్చిపోవ‌డం కోసం సినిమా రిలీజైన మూడ‌వ రోజే దుబాయ్ వెళ్లిపోవ‌డం ప‌లువురిని షాక్‌కు గురి చేసింది.

ఈ మూవీ త‌రువాత సురేంద‌ర్‌ రెడ్డి బాగా సైలెంట్ అయిపోయాడు. 'ఏజెంట్‌' విడుద‌లై మూడేళ్లు కావ‌స్తున్నా సురేంద‌ర్‌రెడ్డి మ‌రో ప్రాజెక్ట్‌ని ప‌ట్టాలెక్కించ‌లేక‌పోయాడు. గ‌త కొంత కాలంగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిన సురేంద‌ర్‌రెడ్డి ..ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా రామ్ తాళ్లూరి నిర్మిణంలో ఓ భారీ సినిమాకు శ్రీ‌కారం చుట్టాల‌ని ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌ని ప్ర‌క‌టించారు కూడా. కానీ అది ముందుకు వెళ్లలేదు. వ‌రుస ప్రాజెక్ట్‌లు ఉండటం, ప‌వ‌న్ రాజ‌కీయాల్లో బిజీగా మార‌డంతో అది సాధ్య‌ప‌డ‌లేదు. అయితే మూడేళ్ల విరామం త‌రువాత ప‌వ‌న్‌తో ప్రాజెక్ట్‌ని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు.

జ‌న‌వ‌రి 1న నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఈ ప్రాజెక్ట్‌ని అధికారికంగా ప్ర‌క‌టించారు. వ‌క్కంతం వంశీ క‌థ అందిస్తున్న ఈ మూవీని రామ్ తాళ్లూరి 'జైత్ర రామ్ మూవీస్' బ్యాన‌ర్‌పై నిర్మించ‌బోతున్నారు. ప‌వ‌ర్ ఫుల్ క్యారెక్ట‌ర్‌లో ప‌వ‌న్ క‌నిపించ‌నున్న ఈ సినిమా గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామాగా కానీ, ప‌వ‌ర్‌ఫుల్ మిల‌ట‌రీ ఆఫీస‌ర్ స్టోరీ నేప‌థ్యంలో కానీ సాగే అవ‌కాశం ఉంద‌ని ఇన్ సైడ్ టాక్‌. సురేంద‌ర్‌రెడ్డి త‌ర‌హాలోనే వంశీ పైడిప‌ల్లి కూడా కొత్త ప్రాజెక్ట్‌ని ప్ర‌క‌టించి మ‌ళ్లీ ట్రాక్‌లోకి రావాల‌ని అంతా భావిస్తున్నారు.