Begin typing your search above and press return to search.

వంశీ పైడిప‌ల్లి యూట‌ర్న్ తీసుకుంటున్నాడా?

వంశీ పైడిప‌ల్లి `వార‌సుడు `త‌ర్వాత ఇంత వ‌ర‌కూ కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌టించని సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయి రెండేళ్లు అవుతుంది.

By:  Tupaki Desk   |   16 July 2025 5:00 AM IST
వంశీ పైడిప‌ల్లి యూట‌ర్న్ తీసుకుంటున్నాడా?
X

వంశీ పైడిప‌ల్లి `వార‌సుడు `త‌ర్వాత ఇంత వ‌ర‌కూ కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌టించని సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయి రెండేళ్లు అవుతుంది. ఈ చిత్రానికి ముందు `మ‌హ‌ర్షి` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ఉన్నా? ఖాళీగా ఉండా ల్సిన ప‌రిస్థితి. స్టార్ హీరోలంతా పాన్ ఇండియా చిత్రాల‌తో బిజీగా ఉండ‌టంతో హిట్ ఇచ్చిన డైరె క్ట‌ర్లు కూడా వెయిట్ చేస్తున్నారు. దీంతో వంశీ ఈ మ‌ద్య‌నే బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కు ట‌చ్ లోకి వెళ్లా డు. అమీర్ కి స్టోరీ లైన్ వినిపించిన‌ట్లు తెలిసింది. అమీర్ కూడా న‌చ్చ‌డంతో స్టోరీ డెవ‌ల‌ప్ చేయ‌మ‌ని సూచించిన‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది.

అయితే తాజాగా అందుతోన్న స‌మాచారం ఏంటంటే? వంశీ యూట‌ర్న్ తీసు కున్న‌ట్లు వినిపిస్తుంది. అమీర్ ఉన్న బిజీ షెడ్యూల్ లో ఇప్ప‌టికిప్పుడు స్టోరీ సిద్దం చేసి తీసుకెళ్లినా డేట్లు ఇచ్చే ప‌రిస్థితి ఉండ ద‌ని భావించి అక్క‌డికి వెళ్ల‌డం కంటే తెలుగులో హీరోని సెట్ చేసుకోవ‌డం ఉత్త‌మంగా భావిస్తున్నాడుట‌. ఈనేప‌థ్యంలో యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌కు ట‌చ్ లోకి వెళ్లాడుట‌. ఇటీవ‌లే చైని క‌లిసి ఓ స్టోరీ వినిపించాడుట‌. న‌చ్చ‌డంతో చైత‌న్య కూడా పాజిటివ్ గానే స్పందించిన‌ట్లు స‌మాచారం.

మ‌రి చైత‌న్య అయినా ఇప్పటిక‌ప్పుడు డేట్లు ఇవ్వ‌డం సాధ్యం కాని ప‌ని. ప్ర‌స్తుతం కార్తీర్ దండు దర్శ‌క త్వంలో ఓ మిస్టిక‌ల్ థ్రిల్ల‌ర్ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్త‌యిన వెంట‌నే ఓ కొత్త ద‌ర్శ‌కుడితో పాటు, శివ నిర్వాణ‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. శివ‌తో 26వ చిత్రం ఉంటుంద‌ని ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. ఈ గ్యాప్ లో నే వంశీ సినిమాకు చై డేట్లు స‌ర్దుబాటు చేసే అవ‌కాశం ఉంటుంది.

కొత్త ద‌ర్శ‌కుడిని హోల్డ్ లో పెట్టి వంశీని లైన్ లోకి తేవ‌చ్చు. కానీ ఆ ఛాన్స్ చైత‌న్య తీసుకుంటాడా? లేదా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం చైత‌న్య కార్తీక్ దండు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇందులో నాగ‌చైత‌న్య డిఫ‌రెంట్ లుక్ ట్రై చేస్తున్నాడు. పోనీ టెయిల్ లుక్ ఇప్ప‌టికే నెట్టింట వైర‌ల్ గా మారిన సంగ‌తి తెలిసింందే.