బాలీవుడ్‌లో పైడిపల్లి అలజడి..?
ఈ నేపథ్యంలో, మరో సౌత్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి బాలీవుడ్‌లో సౌండ్ చేయనున్నాడన్న వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.
By: Tupaki Desk | 15 April 2025 4:57 AMసౌత్ సినిమాల ప్రభావం బాలీవుడ్ పై పెరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో దక్షిణాదిన పేరుపొందిన దర్శకులు బాలీవుడ్‌లో అడుగుపెట్టినట్లు కనిపించినా, ఫలితాల పరంగా మాత్రం పెద్దగా సత్తా చాటలేకపోయారు. మురగదాస్ - సల్మాన్ ఖాన్ ‘సికందర్’కు ఇది చివరి ఉదాహరణ. భారీ బడ్జెట్‌తో రూపొందించినా, సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ అదే సమయంలో, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘జాట్’ మాత్రం మాస్ ఆడియెన్స్‌ను బాగా ఆకర్షించింది.
ఈ నేపథ్యంలో, మరో సౌత్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి బాలీవుడ్‌లో సౌండ్ చేయనున్నాడన్న వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. తెలుగులో పలు హిట్ చిత్రాలు తీసిన వంశీ పైడిపల్లి ఇటీవలే బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌ను కలిసి ఓ కథ లైన్ చెప్పాడని తెలుస్తోంది. ఆ చిన్న లైన్ వినగానే ఆసక్తి చూపిన ఆమిర్ పూర్తి స్క్రిప్ట్ వినాలనీ కోరాడట. తాజా సమాచారం ప్రకారం, ఫైనల్ నెరేషన్ కూడా పూర్తైపోయిందట. ఆమిర్ ఖాన్ కథను బాగా ఇష్టపడ్డాడని, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడన్న వార్తలు బయటకొచ్చాయి. ఇది నిజమైతే వంశీ కెరీర్‌లో గేమ్ ఛేంజర్ అని చెప్పొచ్చు.
అయితే అంతా బాగానే ఉన్నా, పైడిపల్లి బాలీవుడ్ టాప్ స్టార్ ను ఒప్పించడం అనేది మాములు విషయం కాదు. అతను కొత్త కథలను ఎంచుకుంటున్నా, వాటి ప్రెజెంటేషన్ మాత్రం ఎక్కువగా రెగ్యులర్ ఫార్ములాల్లోనే వుంటుందనేది అభిప్రాయం ఉంది. మున్నా, బృందావనం, ఊపిరి, వారసుడు వంటి సినిమాలతో హిట్లు సాధించినా, ఇప్పటివరకు ఇండస్ట్రీ హిట్ రేంజ్‌ను అందుకోలేకపోయిన దర్శకుడిగా వంశీ పైడిపల్లికి ట్యాగ్ ఉంది.
పాన్ ఇండియా అటెంప్ట్ చేయని ఆయనకు బాలీవుడ్ మిస్టర్ పెర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఒక అవకాశాన్ని ఇస్తాడా అన్నది నెగటివ్ షేడ్స్‌లో చర్చకు వస్తోంది. ఇక ఆమిర్ ఖాన్ విషయానికొస్తే, చిన్న ప్లాన్‌కే పెద్దగా టైం పెట్టే వ్యక్తి. తన సినిమాల కోసం ఏకంగా రెండు మూడు సంవత్సరాలు తీసుకునే అమీర్, సింపుల్ నరేషన్ విని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అనేది సందేహమే. ఇప్పటికే చాలామంది బాలీవుడ్ దర్శకులు అతనికి కథలు చెప్పినా, అవి నచ్చకపోవడంతో ఆయన ఎవరినీ ఓకే చేయలేదు.
అలాంటిది వంశీ కథను మాత్రం వెంటనే ఫైనల్ చేయడం నిజమేనా అన్న ప్రశ్న ఫిలింనగర్‌లో వినిపిస్తోంది. నిజంగా సెట్టయితే వంశీ పైడిపల్లికి ఇది బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అయ్యే ఛాన్స్. తెలుగులో ప్రభాస్, ఎన్టీఆర్, విజయ్, రామ్ చరణ్ లాంటి టాప్ స్టార్స్‌తో పని చేసినా, ఒక్క పాన్ ఇండియా సినిమా తీయలేకపోయాడు. కానీ ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్‌లోకి ఆమిర్ ఖాన్ ద్వారా ఎంటర్ అయితే, అది వంశీ గేమ్ ప్లాన్ మొత్తం మార్చే అవకాశం ఉంది. పైగా దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాతగా ఉండే అవకాశం ఉంది కాబట్టి, స్కేల్ విషయంలో ఎలాంటి రాజీ ఉండకపోవచ్చు. ఇక చివరికి ఆమిర్ ఖాన్‌తో వంశీ పైడిపల్లి సినిమా సెట్టవుతుందా లేదా అన్నది కాలమే సమాధానం చెబుతుంది.