Begin typing your search above and press return to search.

పవన్‌. నెం.4 పై క్లారిటీ ఇచ్చిన రైటర్‌

పవన్‌ ఈ మూడు సినిమాలతో పాటు నాల్గవ సినిమాకు కూడా కమిట్‌ అయ్యి, అడ్వాన్స్ తీసుకున్నాడు అంటూ గతంలోనే వార్తలు వచ్చాయి

By:  Tupaki Desk   |   8 Dec 2023 7:41 AM GMT
పవన్‌. నెం.4 పై క్లారిటీ ఇచ్చిన రైటర్‌
X

పవన్ కళ్యాణ్‌ హీరోగా ప్రస్తుతం మూడు సినిమాలు వివిధ దశల్లో షూటింగ్‌ జరుపుకుని ఉన్నాయి. అవి ఎప్పటికి పూర్తి అయ్యేది కనీసం పవన్‌ కళ్యాణ్ కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. సినిమాలను చకచక చేసేసి వచ్చే ఎన్నికలకు సిద్ధం అవ్వాలి అనుకున్న పవన్‌ కళ్యాణ్‌ కి రాజకీయ వ్యవహారాలు ఎక్కువ అవ్వడంతో ఆ సినిమాలను ముగించలేక పోయాడు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకు వస్తున్న ఈ సమయంలో పవన్‌ ఆ మూడు సినిమాలు పూర్తి చేసే అవకాశాలు లేవు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఎన్నికల తర్వాతే పవన్ ఆ సినిమాలను పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు, ఇండస్ట్రీ వర్గాల వారు భావిస్తున్నారు.

పవన్‌ ఈ మూడు సినిమాలతో పాటు నాల్గవ సినిమాకు కూడా కమిట్‌ అయ్యి, అడ్వాన్స్ తీసుకున్నాడు అంటూ గతంలోనే వార్తలు వచ్చాయి. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రామ్‌ తాళ్లూరి ఒక సినిమాను ప్రకటించాడు. ఆ సినిమా ప్రకటన వచ్చి చాలా కాలం అయింది.

షూటింగ్‌ ప్రారంభం అయిన సినిమాలకే దిక్కు లేదు.. ఇక సురేందర్‌ రెడ్డి సినిమాను పవన్‌ మొదలు పెట్టేనా అనే అనుమనాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఆ సినిమాకి కథను అందిస్తున్న ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

వంశీ దర్శకత్వంలో రూపొందిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా మాట్లాడుతూ.. కథ చెప్పిన సమయంలో పవన్‌ కళ్యాణ్ గారు చాలా ఎగ్జైట్ అయ్యారు. ఎప్పుడు చేద్దామని ఆయన అడిగారు. ఒక సోషల్‌ ఇష్యూ పై ఈ సినిమా ఉంటుంది. ఆ ఇష్యూ పవన్‌ గారికి బాగా నచ్చింది. కాస్త ఆలస్యం అయినా తప్పకుండా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో పవన్‌ సినిమా ఉంటుందని దర్శకుడు వంశీ పేర్కొన్నాడు.