బన్నీ కాంపౌండ్ లోనే డిజాస్టర్ డైరెక్టర్?
అయితే ఇప్పుడు ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లోకి వంశీ వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 7 May 2025 2:30 PMవక్కంతం వంశీ.. ఆయన గురించి అందరికీ తెలిసిందే. ప్రేమ కోసం మూవీతో రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. కిక్, రేసుగుర్రం లాంటి పలు సూపర్ హిట్ సినిమాలకు కథలు అందించారు. మంచి సక్సెస్ లు అందుకున్నారు. ఆ తర్వాత దర్శకుడిగా మారారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో డైరెక్టర్ గా డెబ్యూ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తెరకెక్కించారు.
కానీ ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని యంగ్ హీరో నితిన్ తో ఎక్స్ట్రా ఆర్డినరీ సిసినిమాను తెరకెక్కించారు వంశీ. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమా కూడా నిరాశపరిచింది. అంతకుముందు అఖిల్ డిజాస్టర్ మూవీ ఏజెంట్ కు ఆయన కథ అందించారు.
అలా వరుసగా ఫ్లాపులతో సరిపెట్టుకున్నారు వక్కంతం వంశీ. 2023 చివర్లో ఎక్స్ట్రా ఆర్డినరీ మూవీ రాగా, ఇప్పటివరకు మరో సినిమాతో సందడి చేయలేదు ఆయన. ఎలాంటి అనౌన్స్మెంట్లు లేకపోవడం పక్కనపెడితే.. సోషల్ మీడియాలో కనీసం ఊహాగానాలు చక్కర్లు కొట్టడం లేదు. దీంతో ఆయనేం చేస్తున్నారోనని అంతా మాట్లాడుకుంటున్నారు.
అయితే ఇప్పుడు ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లోకి వంశీ వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ సపోర్ట్ తో అక్కడే తాను రాసుకున్న పలు కథలపై చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా పలు చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నిజానికి.. కెరీర్ మొదటి నుంచి కూడా వంశీకి బన్నీ సపోర్ట్ చేస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ మూవీతోనే ఆయన డైరెక్టర్ గా మారిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు ఆయన మళ్లీ సపోర్ట్ తోనే బడా ప్రొడక్షన్ హౌస్ లోకి వెళ్లినట్లు సమాచారం. ఫ్యూచర్ లో క్రేజీ ప్రాజెక్టులు రూపొందించేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు. ఆ తర్వాత గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థగా జీఏ 2 పిక్చర్స్ స్టార్ట్ చేశారు. ఆ బ్యానర్ పై బన్నీ వాస్ సినిమాలు నిర్మిస్తున్నారు. రీసెంట్ గా తండేల్ మూవీ విషయంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాస్ పేరు పడింది. అలా వరుస సినిమాలు నిర్మిస్తున్న గీతా ఆర్ట్స్ తో వంశీ ఎలాంటి సినిమాలు చేయనున్నారో వేచి చూడాలి.