Begin typing your search above and press return to search.

వైష్ణవ్ తేజ్ వాట్ నెక్స్ట్..?

ఎంట్రీ ఇవ్వడమే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఫస్ట్ మూవీ ఉప్పెనతోనే తన టాలెంట్ ఏంటన్నది చూపించాడు.

By:  Tupaki Desk   |   2 Sep 2023 3:15 AM GMT
వైష్ణవ్ తేజ్ వాట్ నెక్స్ట్..?
X

ఎంట్రీ ఇవ్వడమే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఫస్ట్ మూవీ ఉప్పెనతోనే తన టాలెంట్ ఏంటన్నది చూపించాడు. బుచ్చి బాబు డైరెక్షన్ లో వచ్చిన ఉప్పెన సినిమాతో డైరెక్టర్ ఒక్కడే కాదు హీరో వైష్ణవ్ తేజ్ హీరోయిన్ కృతి శెట్టి కూడా మొదటి సినిమా అవడం విశేషం. ఉప్పెనలో బేబమ్మగా కృతి శెట్టి యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. హిట్ తో కెరీర్ మొదలు పెట్టిన వైష్ణవ్ తేజ్ రెండో సినిమాకే క్రిష్ డైరెక్షన్ లో ఛాన్స్ పట్టాడు. కొండపొలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైష్ణవ్ తేజ్ ఆ సినిమాతో అంచనాలను అందుకోలేదు.

ఇక థర్డ్ మూవీ గిరీశయ్య డైరెక్షన్ లో రంగ రంగ వైభవంగా సినిమా చేయగా అది కూడా తుస్సుమన్నది. ఒక హిట్టు రెండు వరుస ఫ్లాపులు వైష్ణవ్ తేజ్ కెరీర్ ని డైలమాలో పడేశాయి. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ ఆదికేశవ సినిమా చేస్తున్నాడు. త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీజర్ ఇంప్రెస్ చేసింది. ఊరిలోని శివాలయాన్ని కాపాడే రుద్రుడుగా వైష్ణవ్ తేజ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తుంది.

ధమాకా హిట్ తో వరుస ఛాన్స్ లు అందుకుంటున్న శ్రీ లీల వైష్ణవ్ తేజ్ సినిమాకే ముందు సైన్ చేసింది. ఆదికేశవ సినిమాను శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ కలిసి నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా తో వైష్ణవ్ తేజ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఆదికేశవ తర్వాత వైష్ణవ్ తేజ్ మరో రెండు కథలు దాదాపు కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించిన డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది.

మెగా మేనల్లుడిగా మొదటి సినిమానే సంచలన విజయం అందుకున్న వైష్ణవ్ తేజ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోని రావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆదికేశవ హిట్ కొడితే ఓకే కానీ ఆ సినిమా రిజల్ట్ తేడా కొడితే మాత్రం వైష్ణవ్ తేజ్ కెరీర్ రిస్క్ లో పడినట్టే లెక్క. యువ హీరోలంతా కూడా ప్రయోగాలతో కెరీర్ లో దూసుకెళ్తుంటే వైష్ణవ్ తేజ్ కూడా వారికి ధీటుగా సినిమాలు చేయాలని చూస్తున్నాడు. ఉప్పెన లాంటి మరో సూపర్ హిట్ పడితే కానీ ఈ యువ మెగా హీరో కెరీర్ స్ట్రాంగ్ గా నిలబడే అవకాశం ఉంటుంది.