Begin typing your search above and press return to search.

బాలయ్య - బేబీ.. ఇంట్రెస్టింగ్ రూమర్స్‌

దిల్ రాజు బ్యానర్‌ లో ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు మరో సినిమాను కూడా అదే బ్యానర్‌ లో చేసేందుకు కమిట్‌ అయ్యిందట.

By:  Tupaki Desk   |   1 Feb 2024 9:36 AM GMT
బాలయ్య - బేబీ.. ఇంట్రెస్టింగ్ రూమర్స్‌
X

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిల కంటే కూడా ఎక్కువగా హీరోయిన్స్ గా ముంబై ముద్దుగుమ్మలు మరియు కేరళ ముద్దుగుమ్మలు కనిపిస్తున్న విషయం తెల్సిందే. ఇలాంటి సమయంలో బేబీ సినిమా తో సెన్షేషన్‌ క్రియేట్‌ చేసిన తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య. ఈ అమ్మడు బిజీ హీరోయిన్ గా మారిపోయింది.


దిల్ రాజు బ్యానర్‌ లో ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు మరో సినిమాను కూడా అదే బ్యానర్‌ లో చేసేందుకు కమిట్‌ అయ్యిందట. ఇక బయట బ్యానర్స్ లో కూడా ఈ అమ్మడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ సమయంలోనే బాలయ్య సినిమాలో బేబీ అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు.. కాని నందమూరి అభిమానులు మాత్రం బాలయ్య సినిమాలో వైష్ణవి ఉంటే కచ్చితంగా బాగుంటుంది అనే అభిప్రాయం ను వ్యక్తం చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమాలో హీరోయిన్‌ గా శ్రద్ధా శ్రీనాథ్ ను ఎంపిక చేయడం జరిగిందనే వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు బాలయ్య సినిమాలో వైష్ణవి కూడా నటిస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఒకింత గందరగోళానికి గురి అవుతున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో వైష్ణవి నటించబోతుందా లేదంటే త్వరలో బోయపాటి దర్శకత్వంలో బాలయ్య చేయబోతున్న సినిమాలో వైష్ణవి కనిపించబోతుందా అనే చర్చ జరుగుతోంది.

మొత్తానికి బాలయ్య సినిమాలో ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య కి అవకాశం రావడం అనేది కచ్చితంగా ఆమె లక్ గా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మాత్రం యంగ్‌ హీరోలతో సినిమాలు చేస్తున్న సమయంలో బాలయ్య సినిమాలో నటించడం అవసరమా అన్నట్టు కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.